విడాకుల తర్వాత కూడా సమంత తాను ఎక్కడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. విడాకుల తర్వాత హాట్‌గా, బోల్డ్‌గా ఉండే విషయంలో మరింత రెచ్చిపోతోంది. పుష్ప సినిమాలో ఊ అంటావా మావా అంటూ చేసిన ఐటెం సాంగ్ యూత్‌కు ఎంత కిక్ ఇచ్చిందో చూశాం. ఇక ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సామ్ రచ్చ చేసేందుకు రెడీ అయ్యింది. బాలీవుడ్ లో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా మూడు క్రేజీ ప్రాజెక్టులు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మూడు ప్రాజెక్టులను ఒకేసారి ఎనౌన్స్ చేయించడం ద్వారా తనేంటో అక్కడ స్టార్ హీరోయిన్లకు కూడా చెప్పాలన్నట్టుగా ఆమె డిసైడ్ అయ్యింది.
అక్కడ హాట్ వెబ్‌సీరిస్‌లు మాత్రమే నటించడమే కాదు.. ఇప్పుడు స్టార్ హీరోలకు జోడీగా బోల్డ్ పాత్రలు చేసేందుకు కూడా రెడీ అవుతోంది. ఇటు తెలుగులోనూ ఆమె చేతిలో శాకుంతలం, యశోద, విజయ్ దేవరకొండ పక్కన ఖుషీ సినిమాలు కూడా చేస్తోంది. ఆమె సౌత్ ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్ అందుకుంటోన్న హీరోయిన్లలో టాప్ ప్లేస్‌లో ఉంది. సమంత గతంలోనూ తన రెమ్యునరేషన్ గురించి ప్రత్యేకంగానే వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
సమంత ప్రస్తుతం ఒక్కో సినిమాకు రు. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. విడాకుల తర్వాత ఒక్కో సినిమాకు రు. 2-3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సమంత ఇప్పుడు ఏకంగా తన రెమ్యునరేషన్ ఏకంగా రు. 5 కోట్లకు పెంచేసిందని తెలుస్తోంది. సమంత రేటు పెంచేసినా ఆమె డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా కోట్లు తీసుకుంటోన్న సమంత తన కెరీర్ స్టార్టింగ్‌లో మాత్రం చాలా ఇబ్బందులు పడింది.
ఆమె స్కూల్లో పదో తరగతి చదువుతున్నప్పుడు ఓ కాన్ఫరెన్స్ కోసం హోటల్లో హోస్ట్‌గా వర్క్ చేసిందట. అప్పుడు 8 గంటల షిఫ్ట్‌లో పనిచేసిందుకు గాను ఆమెకు రు. 500 ఇచ్చారట. అదే తన మొదటి సంపాదన అని.. ఆ సంపాదన తాను ఎప్పటకీ మర్చిపోలేను అని సమంత చెప్పింది.