సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అవకాశం రావడం అంటే ఇప్పుడు చాలా సులభమే. ఏడాదికి అన్నీ సౌత్ భాషలలో కలిసి వందల కొద్దీ చిన్న, మీడియం, భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో దాదాపు 80 శాతానికి పైగా కొత్త అమ్మాయిలనే హీరోయిన్స్‌గా తీసుకునేందుకు మేకర్స్
ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా ముంబైలో ఉండే మోడల్స్‌ను మన మేకర్స్ పట్టుకుంటున్నారు. మొదటి సినిమాకు వీరు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ. అయితే, ఆ మొదటి సినిమాకు ఎంపిక కావడం మాత్రం ఉన్న పోటీని తట్టుకొని నెట్టుకొని రావడం కాస్త కష్టమే.
ఇక కొందరికి అవకాశాలు రావాలంటే ఆఫీసుల చుట్టూ బాగానే తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టికి మొదటి అవకాశం రావడానికి మాత్రం తన తల్లి కారణం అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తుందట. ఉప్పెన
సినిమాకు ముందు కృతి శెట్టి కొన్ని సినిమాల ఆడిషన్స్‌లో పాల్గొన్నదట. కానీ ఎందులోనూ తనకి అవకాశం దక్కలేదని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్. దీనికి కారణం తనకు కాస్త పళ్ళు ఎత్తుగా కనిపిస్తుండటమేనట.
కొన్ని కోణాలలో కృతి స్క్రీన్ పై అంతగా ఆకట్టుకునే లుక్ ఉండదు. కానీ, కొన్ని కోణాలలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇదే కాస్త సమస్యగా మారిందట. అందుకే చాలా వరకు ఆడిషన్స్ అయ్యాక ‘మళ్ళీ చెప్తాం’..’సారీ అండీ’.. అని రిజక్ట్ చేశారట. దాంతో ఇక లాభం లేదనుకొని స్వయంగా కృతి
శెట్టి తల్లి దర్శకనిర్మాతలతో మాట్లాడి..ఒక్క అవకాశం ఇవ్వండి తనేంటో ప్రూవ్ చేసుకుంటుందీ అని రిక్వెస్ట్ చేసిందట. క్యారెక్టర్ పరంగా మీరు ఏం చెప్పినా చేయగలుగుతుందీ అని భరోసా ఇచ్చిందట.
కథలో పాత్ర డిమాండ్ చేసిన మేరకు ఎలా అయినా నటించడానికి తను అభ్యంతరం చెప్పదని కూతురు మాటగా కృతి తల్లి నమ్మకంగా చెప్పిందని ఇన్‌సైడ్ టాక్. అందుకే ఉప్పెన సినిమాలో ఛాన్స్ దక్కిందని..ఇది షూటింగ్‌లో ఉండగానే కొందరు మేకర్స్ సెట్స్‌కు వచ్చి కృతి పర్ఫార్మెన్స్ చూసి నెక్స్ట్
సినిమాలలో చక చకా డేట్స్ లాక్ చేసుకున్నారట.
అలా ఉప్పెన రిలీజ్ కాకముందే రామ్ పోతినేని ‘ది వారియర్’ సినిమా, నాగ చైతన్యతో ‘బంగార్రాజు’,
నానితో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలు కమిటైంది. అంతేకాదు, నానితో లిప్ లాక్ విషయం కూడా ఓపెన్‌గా తల్లి ముందే చర్చించి సినిమాకు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే కృతి శెట్టి ఏం చేయాలన్నా ముందు తల్లి సపోర్ట్ బాగా ఉందని అర్థమవుతోంది.