రాఘవేంద్ర రావు సినిమా అంటే పూలు, పళ్ళు, హీరోయిన్ నాభి అందాల ప్రదర్శన, ఎద అందాల ప్రదర్శన..తప్పనిసరి. ఆయన ఎన్ని సినిమాలు చేసిన ఎంతమంది హీరోయిన్స్ ని తెరమీదకి తీసుకువచ్చిన ఇవి కామన్‌గా ఉంటాయి. కానీ, ఎప్పుడు కూడా అవి ఆడియన్స్ కి బోర్ కొట్టింది లేదు. ప్రత్యేకంగా హీరోయిన్ లోని అందచందాలను ఎంత కొత్తగా చూపించాలో దానికోసం పాట సాహిత్యం రాసేటప్పటి నుంచే ఒక ఆలోచనతో ఉంటారు.
నాటి తరం హీరోయిన్ల నుంచి ఈ తరం తాప్సీ, శ్రీలీల వరకు అందరిమీద ఆయన పూలు, పండ్లు వేయించి.. నాభి అందాలతో ప్రేక్షకులను మత్తెక్కించినవారే..! ఎలాంటి సన్నివేశం తర్వాత ..ఏ సందర్భంగాలో పాట వస్తుంది..ఆ పాట మూడ్ ఎలా ఉంటుంది..హీరో హీరోయిన్ ఎలాంటి ప్లేస్‌లో ఉంటారు..అప్పుడు వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది..పూర్తిగా లిరిక్ రైటర్‌కి చెప్పి అందుకు అనుగుణంగా పదాలు కుదిరేలా పాట రాయిస్తారు.
ఆ పాట లోని పదాలకు తగ్గట్టుగా హీరో, హీరోయిన్లను తయారు చేస్తారు. షూటింగ్ సమయంలో హీరోయిన్ మీద దర్శకేంద్రుడు వేసే పూలు పళ్ళు గురించే ఆసక్తి చర్చలు ఉంటాయి. ఈ సారి ఈ హీరోయిన్ని ఏ పండుతో ఎక్కడ కొట్టబోతున్నాడు అని. అయితే, దాదాపు ఆయన హీరోయిన్స్ ని ఎక్కువగా నడుము, నాభి భాగం మీదనే ఫోకస్ పెట్టే రాఘవేంద్ర రావు ఒక్క రోజా విషయంలో మాత్రం ఆయన కెమెరా కన్ను పెదవులపైకి వెల్లింది. తన సినిమాలలో ఎక్కువగా రోజా నవ్వును..పెదవులను ఎక్కువగా చూపించారు.
ఇదే విషయం గతంలో ఓసారి రోజా కూడా చెప్పారు. రాఘవేంద్ర రావు అంటే హీరోయిన్స్ ని ఎక్కువగా ఆక్కడే చూపిస్తారు. కానీ, నా విషయంలో మాత్రం ఆయన నా స్మైల్ మీద, లిప్స్ మీద కాన్సంట్రేట్ చేశారు అని. అంటే రోజాలో దర్శకేంద్రుడికి ఎక్కువగా నచ్చిన భాగం నాభి కంటే కూడా పెదవులు అని. ఏదేమైనా హీరోయిన్ నాభి సౌందయాన్ని చూపించడంలో రాఘవేంద్ర రావు తర్వాతే ఎవరైనా. సౌందర్య లహరి కార్యక్రమంలో కూడా ఎక్కువగా వచ్చిన ప్రస్తావన దీని గురించే.
అంతేకాదు, సింబాలిక్‌గా అదే బ్యాక్ డ్రాప్ ఆ కార్యక్రమంలో కనిపిస్తుంది. ఆయనతో పనిచేసిన హీరోయిన్స్ అందరినీ ఈ షో ద్వారా మళ్ళీ జనాల ముందుకు తీసుకువచ్చి పాటల చిత్రీకరణ సమయంలో వారితో జరిగిన అనేక విషయాలను వెల్లడించారు. ఇప్పటికీ కొన్ని రొమాంటిక్ సాంగ్స్‌లో ఆయన పెట్టిన కెమెరా కోణాలు యంగ్ డైరెక్టర్ కూడా పెట్టలేడనేది ఒప్పుకొని తీరాల్సిందే.