Moviesఅనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కెరీర్‌కు ఆ కుర్ర హీరోకు ఇంత లింక్ ఉందా...!

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కెరీర్‌కు ఆ కుర్ర హీరోకు ఇంత లింక్ ఉందా…!

అనుపమ పరమేశ్వరన్ ఆశలన్నీ ఆ ఒక్క కుర్ర హీరోమీదే..ఏం చేస్తాడో..? ప్రస్తుతం మలయాళ కుట్టి అనుపమ గురించి నెటిజన్స్ ఇదే మాట్లాడుకుంటున్నారు. మలయాళ హిట్ సినిమా ప్రేమమ్మ్ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులో గురూజీ మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా తెరకెక్కిన అ..ఆ సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ కాకపోయినా కూడా తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో సినిమా అవకాశాలు అందుకుంది.

తెలుగులో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమా శతమానం భవతి. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో తెలుగులో వరుసగా డీసెంట్ మూవీస్ చేసే అవకాశాలు దక్కాయి. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్‌యూ లాంటి సినిమాలు చేసింది. ఇవి పెద్దగా సక్సెస్ సాధించలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన రాక్షసుడు సినిమా మంచి హిట్ సాధించింది. అయితే, అనుపమ పోషించినవన్నీ డీసెంట్ రోల్స్ కావడంతో గ్లామర్ హీరోయిన్స్ దెబ్బకి తట్టుకోలేకపోయింది.

దాంతో అనుపమకి అవకాశాలు లేకుండా పోయాయి. మధ్యలో హీరోయిన్‌గా కంప్లీట్‌గా ఫేడవుట్ అయింది. ఇక కెరీర్ క్లోజ్ అనుకున్నారు. కానీ, అదృష్టం కొద్దీ నిఖిల్ హీరోగా నటించే రెండు సినిమాలలో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంది. ఆ సినిమాలే 18 పేజెస్, బ్లాక్ బస్టర్ కార్తికేయ మూవీ సీక్వెల్ కార్తికేయ 2. ఈ రెండు సినిమాలపై అనుపమ చాలా నమ్మకాలు పెట్టుకుంది. అయితే, ఈ మధ్యలోనే దిల్ రాజు అన్న కొడుకు నటించిన రౌడీ బాయ్స్ సినిమాలో కాస్త గ్లామర్ ఒలకబోసింది. అంతేకాదు, కొత్త హీరో అయినా కూడా దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత చెప్పాడు కాబట్టి లిప్ కిస్ ఇవ్వడానికి సై అనింది.

ఇదే ఊపుతో ఇప్పుడు చేస్తున్న కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తే అనుపమకి ఇక తిరుగుండదు. గతంలో కంటే ఇప్పుడు బాగా స్లిం అయి అందరినీ ఆకర్షిస్తోంది. ఇలాంటి సమయంలో కుర్ర‌ హీరో.. నిఖిల్ సినిమాలు గనక హిట్ అయితే, అనుపమకి బాగా కలిసి వస్తుంది. మరి ఈ యంగ్ హీరో అనుపమని ఏం చేస్తాడో చూడాలి. ఇప్పటికే అటు 18 పేజెస్ మూవీ పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక కార్తికేయ 2 నుంచి ఇప్పటివరకూ వచ్చినవన్నీ మంచి అంచనాలు రేకెత్తించాయి. చూడాలి మరి ఈ రెండు సినిమాలు అనుపమ కెరీర్‌కి ఎలా ఉపయోగపడతాయో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news