ఎందుకో గాని సమంతకు టాప్ హీరోయిన్లకు మధ్య తెలియకుండానే కోల్డ్‌వార్‌లు నడుస్తున్నాయి. గత రెండేళ్ల క్రితం నుంచి సోషల్ మీడియాలో సమంత ఫ్యాన్స్ వర్సెస్ పూజా హెగ్డే ఫ్యాన్స్ మధ్య పెద్ద మాటల యుద్ధాలు నడిచాయి. ఆ టైంలో సమంతకు, పూజాకు మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న వాతావరణం నెలకొంది. కట్ చేస్తే ఇప్పుడు సమంతకు రష్మిక మందన్నకు కూడా పడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక పాన్ ఇండియా హీరోయిన్ల లిస్టులో చూస్తే సమంత టాప్ ప్లేసులోనే ఉంది. సర్వేలు కూడా ఈ విషయాన్ని చెపుతున్నాయి. తాజాగా ఆర్ మాక్స్ సంస్థ చేసిన సర్వేలో కూడా సమంతే నెంబర్ వన్ అన్న విషయం క్లీయర్‌గా తెలుస్తోంది. విడాకుల తర్వాత సమంత టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో దూసుకుపోతోంది. అయితే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆమె చాపకింద నీరులా వ్యవహరిస్తోంది.
ఆమె ఎందుకు ? ఇలా చేస్తోందన్న ప్రశ్నకు రష్మిక మందన్న పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. రష్మిక బన్నీ పక్కన చేసిన పుష్ప సినిమాతో బాలీవుడ్‌కు దగ్గరైంది. ఆమె తొలిసారిగా హిందీలో చేసిన సినిమా రిలీజ్ కాలేదు. కానీ పుష్ప దెబ్బతో ఆమె దూసుకుపోతోంది. వరుసగా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. మిషన్ మజ్ను,గుడ్ బై, యానిమల్ లాంటి భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.
అయితే ఇప్పుడు రష్మిక జోరుకు బ్రేక్ వేసేందుకు సమంత రెడీ అవుతోందట. తాను బాలీవుడ్‌లో నటిస్తోన్న మూడు ప్రాజెక్టులను ఒకేసారి ఎనౌన్స్ చేయించి రష్మికకు షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోందట. ఆ మూడు క్రేజీ ప్రాజెక్టులను ఒకేసారి ఎనౌన్స్ చేయించడం ద్వారా తనదే పైచేయిగా ఉండేలా చూసుకోవాలన్నదే సామ్ పంతం అని తెలుస్తోంది.
ప్రొఫెషనల్‌గా వీరిద్దరి మధ్య రైవల్‌రీ క్రమంగా స్టార్ట్ అయ్యి.. చివరికి పెరిగిపెద్దది అయిపోయిందని తెలుస్తోంది. ఈ పంతంలో ఎవ్వరూ వెనక్కు తగ్గేలా లేరట. అయితే వీరిలో ఎవరు పై చేయి సాధిస్తారు ? అన్నది మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యాకే తేలనుంది.