సిల్క్ స్మిత ఒకప్పుడు టాలీవుడ్ ను తన అందంతో ఊపేసిన ముద్దుగుమ్మ. ఐటమ్ సాంగ్స్ తో రొమాంటిక్ పాత్రలతో సిల్క్ ఇండస్ట్రీలోనే ఫుల్ బిజీనటిగా మారిపోయింది. కైపెక్కించే కళ్లు నాచురల్ ఫిగర్ సిల్క్ సొంతం. ఇండస్ట్రీలో అంతటి గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ బ్యాగ్రౌండ్ తెలిస్తే అసలు ఈ స్థాయికి ఎలా ?ఎదిగింది అని ఆశ్చర్యపోవాల్సిందే. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. కాగా పేదింటి కుటుంబంలో జన్మించింది. ఏలూరు దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో సిల్క్ స్మిత జన్మించింది. సిల్క్ తల్లిదండ్రలు వ్యవసాయంతో పాటూ కూలి పనులకు వెళ్లేవాళ్లు.
పేద కుటుంబం కావడంతో సిల్క్ చేత 5వ తరగతిలోనే చదువు మాన్పించేశారు. అంతేకాకుండా 14ఏళ్ల వయసులోనే ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. భర్త అత్తమామాల వేధింపులు తట్టుకోలేక సిల్క్ ఎవరికీ చెప్పకుండా తన మేనత్తతో కలిసి చెన్నైకి వెళ్లిపోయింది. అక్కడ సిల్క్ ను ఆమె మేనత్త తెలిసిన వారి వద్ద మేకప్ ఎలా వేయాలో ? నేర్పించారు. ఆ తరవాత సిల్క్ సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ లకు మేకప్ వేసుకుంటూ జీవనం సాగించింది. ఈక్రమంలో నిర్మాత వినూ చక్రవర్తి కంట్లో సిల్క్ పడింది. ఆమె అందం చూసి ఫిదా అయిపోయిన విను చక్రవర్తి వెంటనే పిలిచి సినిమాల్లో పనిచేస్తావా అని ప్రశ్నించారు.
పక్కనే ఉన్న విను చక్రవర్తి భార్య నేనున్నాను నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్పి రు. 5 వేలు చేతిలో పెట్టారు. ఆ తరవాత యాక్టింగ్…ఇంగ్లీష్ కూడా వాళ్లే నేర్పించారు. స్మిత అని పేరు పెట్టి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాలో బార్ గర్ల్ గా నటించగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తరవాత చాలా సినిమాల్లో నటించింది. కానీ కొందరు సిల్క్ కు డబ్బులు ఎరవేసి బీ గ్రేడ్ సినిమాల్లో నటించేలా చేశారు. అయినప్పటికీ సిల్మ్ కు మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఆఫర్లు తగ్గలేదు. అప్పట్లో ఆమె ఐటెం సాంగ్‌ల కోసమే సినిమాలకు వెళ్లిన వారు కూడా ఉన్నారు.
ఇక చిరంజీవి,కమల్ హాసన్, రజినీకాంత్ ఇలా ప్రతిస్టార్ పక్కన నటించింది. 36 ఏళ్లకు సిల్క్ స్టార్ గా మారిపోయింది. అసలు ఆమె కాల్షీట్లు ఒక్క రోజు కూడా ఖాళీ లేనంత బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఆమెను ఎంతో మంది దర్శక, నిర్మాతలు రకరకాలుగా వాడుకున్నారు. ఇలా సినిమాల్లో బిజీగా ఉన్న సిల్క్ జీవితంలోకి ఓ వ్యక్తి పేమ పేరుతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత అతనే సిల్క్ ఫైనాన్స్ వ్యవహారాలు చూసుకునేవాడు.
ఆమె అకౌంట్స్ అన్నీ ఖాళీ చేసి చివరికి అప్పుల్లోకి నెట్టేసి వెళ్లిపోయాడు. దాంతో మనసు ముక్కలైన సిల్క్ మత్తుకు బానిసయ్యింది. చెన్నైలోని తన ఇంట్లో మూడు రోజులపాటూ గ్యాప్ లేకుండా మద్యం తాగింది. ఇక మూడు రోజులు వరుసగా తాగిన సిల్క్ 1996 సెప్టెంబర్ 23 న ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన తరవాత ఆమె శరీరంలో మోతాదుకు మించి ఆల్కహాల్ శాతం ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. సిల్క్ చనిపోయి 26 ఏళ్లు అవుతున్నా ఇప్పటకీ ఆమె గురించి ఈ తరం వాళ్లు కూడా చిన్న వార్త అయినా ఆసక్తిగా తెలుసుకుంటారు.