సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ అల్లుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కెరీర్ పరంగా ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నాడు. ధనుష్ ఇప్పుడు కోలీవుడ్ లో మాత్రమే కాకుండా తెలుగు డైరెక్టర్లతో పాటు అటు బాలీవుడ్లో స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తున్నాడు. ధనుష్ పాన్ ఇండియా మార్కెట్ పై కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనిపిస్తోంది. కెరీర్ పరంగా టాప్ పొజిషన్ లో ఉన్న ధనుష్ మ్యారేజ్ లైఫ్ లో మాత్రం ఫెయిల్ అయ్యాడు అని చెప్పాలి.
తాను ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో కొద్ది నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల వీరి వైవాహిక జీవితంలో వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ధనుష్ తన భార్యతో విడిపోవడానికి ప్రధాన కారణం పలువురు హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకోవటమే కారణమన్న ఆరోపణలు కూడా వినిపించాయి. కోలీవుడ్ మీడియా కూడా ధనుష్ ఎఫైర్ల పై కోడై కోసింది.
అయితే ధనుష్ ఈ వార్తలపై ఎప్పుడు స్పందించలేదు. అయితే తాజాగా ధనుష్ పై సుచీలీక్స్ పేరుతో చేసిన ఆరోపణలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. 2017లో సింగర్ సుచిత్ర కార్తీక్ ధనుష్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో సుచిత్ర చెప్పిన దాని ప్రకారం ధనుష్, అనిరుధ్ కలిసి ఓ పార్టీలో ఫుల్లుగా మద్యం సేవించారట.
అప్పుడు సుచిత్ర కూడా మద్యం మైకంలోనే ఉందట. అయితే ఆమెకు ఇచ్చిన డ్రింక్‌లో ఏదో కలపడంతో ఆమె స్పహ తప్పిపడిపోయిందట. వెంటనే ఆమె మత్తులోకి వెళ్లిపోగానే ధనుష్, అనిరుధ్ ఇద్దరూ కూడా ఆమెతో శృంగారంలో పాల్గొన్నారట. తర్వాత ఆమెను నగ్నంగానే బెడ్‌మీద వదిలేసి వెళ్లిపోయారట. ఈ భయంకరమైన అనుభవం గురించి తాను ఎక్కడా చెప్పలేదని కూడా ఆమె చెప్పింది. అలాగే ఆమె శరీరంపై గాయాలు ఉన్న ఫొటోలు కూడా పోస్ట్ చేసింది.
సుచిత్ర అలా ఓపెన్ అయిపోవడంతో ఈ విషయమై దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం రేగింది. ఇదే విషయమై ధనుష్‌ను ప్రశ్నిస్తే తన పర్సనల్ విషయాల గురించి మీకు ఎందుకు అని ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. తనకు ప్రైవసీ ఉంటుందని.. అన్నింటికి మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని.. చెప్పాడు. అయితే ఇది ధనుష్ కెరీర్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు.
cruel 😔😔#iSupportSuchi #SuchiLeaks
Must MRetweet pic.twitter.com/5vmG9TflZq— Suchitra karthik (@iSuchitraKarthi) March 4, 2017