సినీ ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, ఎఫైర్లు..కామన్. కానీ, వీటీన్నింటికన్నా.. క్యాస్టిం కౌచ్ అన్న పదం ఎక్కువుగా వినిపిస్తుంటుంది. అవకాశాలు కోసం అమ్మాయిలను శారీరకంగా వాడుకుంటు ఉంటారు కొందరు దర్శక నిర్మాతాలు. అందులో కొదరు హీరోలు కూడా ఉన్నారు అంటుంటారు..సినీ ప్రముఖులు. కానీ వాళ్లు బడా స్టార్స్ కావడంతో తెర పైకి వాళ్ల పేరుని రానివ్వరు. ఒక్కవేళ వచ్చిన డబ్బు ఉన్న పలుకబడితో..ఆ విషయాని ఇట్టే దాచి పెట్టేస్తారు.
అయితే, ఇప్పటి వరకు నన్ను వాడుకున్నారు..నన్ను పెళ్లి చేసుకుంటాను అని మోశం చేశారు..అని చెప్పుకొచ్చిన హీరోయిన్లను, క్యారెక్టర్ ఆర్టిస్లను మాత్రమే చూశాం. అయితే, రీసెంట్ గా మన్మధుడు నాగ్ బ్యూటీ..ఓ బిగ్ బాంబ్ పేల్చింది. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి నీతూ చంద్ర తన ఇండస్ట్రీలో ఫేస్ చేసిన చేదు అనుభవాన్ని జనాలతో పంచుకుంది. ఆమెను ఓ బడా బిజినెస్ మ్యాన్ ..భార్య ఉంటే నెలకు 25 లక్షలు ఇస్తానని ఆఫర్ చేశాడని చెప్పుకొచ్చింది.
ఈ ఇంటర్వ్యుల్లో ఆమె మాట్లాడుతూ..” నేను బిగ్ స్టార్స్ సినిమాల్లో నతించాను. ఆ సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమా లు ప్రతిష్టాత్మక అవార్డ్స్ తీసుకున్నాయి. కానీ, నాకు మాత్రం సినిమా ఆఫర్లు రాలేదు. 13 మంది జాతీయ అవార్డు గ్రహీతలైన నటుల సరసన హీరోయిన్గా చేసిన నాకు ఈ రోజు ఆఫర్లు లేవు..పని లేదు. అంతేకాదు..తనకు ఒక పెద్ద వ్యాపారవేత్త నెలకు రూ. 25 లక్షలు ఇస్తానని, జీతం తీసుకుని భార్యగా ఉండాలని కోరాడు ..”అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. కాగా 2005లో ‘గరం మసాలా’ మూవీతో నీతూ హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ నాగార్జున “మనం” మూవీలో ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపించి మెప్పించింది. నీతూ చంద్ర చివరిగా కనిపించిన తెలుగు చిత్రం మనం కావడం విశేషం. ప్రజెంట్ అమ్మడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.