సినీ రంగంలో తనకంటూ.. ప్రత్యేక ముద్ర వేసుకున్న అన్నగారు ఎన్టీఆర్.. గురించి ఎవరు మాత్రం ఏం చెబుతారు? ఎవరైనా వచ్చి. ఆయన నటన గురించి నాలుగు మాటలు రాయమని అడిగితే.. ఆ ధైర్యం చేసేవారు ఉన్నారా?(అప్పట్లో).. అంటే.. లేరనే అనేవారు. అప్పట్లో.. తొలిసారి సినీరంగ ప్రవేశం చేసిన.. ప్రఖ్యాత రచయిత డాక్టర్ సీ. నారాయణరెడ్డికి ఇలాంటి సమస్య ఒకటి ఎదురైంది. ఆయనను సినీ రంగానికి పరిచయం చేసింది అన్నగారే.
అయితే, అప్పట్లో సినీ రంగంలో దూసుకుపోతున్న వారి గురించి రివ్యూలు రాయడం.. పెద్ద అలవాటుగా ఉంది. దీనికి ప్రజల నుంచి మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది. వాస్తవానికి అప్పట్లో టీవీలు లేవు. డిజిట ల్ మాధ్యమాలు అంతకన్నాలేవు. దీంతో ఎవరైనా పేపర్లనే ఎక్కువగా చూసేవారు. దానిలో వచ్చే రివ్యూలు చదువుకునేవారు. ఈ క్రమంలోనే దిన పత్రికలతో పాటు.. సినీ వారపత్రికలు కూడా ప్రధాన రోల్ పోషించేవి. సినీ రంగానికి సంబంధించిన విశేషాలు అందించేవి.
ఈ క్రమంలోనే సినీ రంగానికి చెందిన ప్రముఖుల జీవిత విశేషాలపై.. వారం వారం.. ఒక కథనం ప్రచురిం చేవారు. ఒకసారి.. ఇదే విషయంపై ప్రముఖ పత్రిక.. సి. నారాయణ రెడ్డిని ఓ పత్రిక కోరింది. అది కూడా అన్నగారి గురించి రాయాలని.. రూ.100 ఇస్తామని చెప్పింది. అప్పటికే సినీ రంగానికి వచ్చి.. పెద్దగా అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్న సినారే.. దీనికి ఒప్పుకొన్నారు. అయితే.. ఈ విషయం అన్నగా రికి తెలిసింది.
దీంతో సినారే పనిచేస్తున్న వాహిని స్టూడియోకు ఫోన్ చేసి.. ఆయనతో అన్నగారు మాట్లాడారు. “ఏం బ్రదర్ మాగురించే రాస్తున్నావట.. ఏం రాస్తున్నారో!“ అని అన్నగారు గంభీరంగా ప్రశ్నించారు. దీంతో సినారే నాలుక కరుచుకున్నారు. “ఏం లేదు సార్.. వారు అడిగారు.. నేను రాస్తున్నాను. అయినా.. మీ గురించి ప్రత్యేకంగా రాసేందుకు ఏం ఉంటుంది ?“ అని చెప్పడంతో చాలానే ఉంది.. రాయండి.. నిర్మొహమాటంగా రాయాలి.
అంతేకాదు.. ఉన్నది ఉన్నట్టు రాయండి. గ్యాసిప్లు వద్దు ఆ! అని అన్నగారు సూచించడంతో.. అన్నగారు ఎలా సినీరంగంలోకి వచ్చారో.. ఎలా ఎదుగుతున్నారో.. సినారే పూసగుచ్చినట్టు వివరించారు. ఈ కథనం ఇప్పటికీ.. పెద్ద ఫొటో కట్టి అన్నగారి ఇంట్లో ఉండడం విశేషం. ప్రస్తుతం ఇది బాలకృష్ణ ఇంట్లో ఉంది.