ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. కానీ అప్పట్లో కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉండేవారు. ఆ రోజుల్లోనే కమెడియన్ గా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజబాబు. బక్కపలుచని శరీరంతో కనిపిస్తూ రాజబాబు అందర్నీ నవ్వించేవాడు. అంతే కాకుండా రాజబాబు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకునేవాడు. ఇక స్టార్ హీరోలు అందరితోనూ రాజబాబు సినిమాలు చేశారు. అంతే కాకుండా కమెడియన్లు హీరోలుగా చేయడం ఇప్పుడు మొదలైంది కాదు. అప్పట్లోనే ఈ ట్రెండ్ కూడా మొదలయ్యింది. కమెడియన్ రాజబాబు కూడా హీరోగా సినిమాలు చేశాడు.
రాజబాబు విజయ నిర్మల, వాణిశ్రీ లాంటి హీరోయిన్ ల పక్కన హీరోగా నటించాడు. అంతే కాకుండా అతిలోక సుందరి శ్రీదేవితో కూడా రాజబాబు సినిమాలో నటించడం విశేషం. అతిలోక సుందరి శ్రీదేవి రాజబాబుకు జోడీగా నటించింది. అయితే ఆమె రాజబాబుకు జోడీగా నటించింది మాత్రం కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కాదు.. శ్రీదేవి అప్పుడప్పుడే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న సమయంలో కావడం విశేషం. 1975 లో కృష్ణ – మంజుల హీరో, హీరోయిన్ లుగా నటించిన దేవుడులాంటి మనుషులు సినిమాలో రాజబాబుకు జోడీగా శ్రీదేవి నటించి అలరించింది.
అంతే కాకుండా ఈ సినిమాలో రాజబాబు – శ్రీదేవి మధ్య ఒక డ్యూయెట్ కూడా ఉంది. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరో విశేషం ఏంటంటే శ్రీదేవి కెరీర్ లో అదే మొదటి డ్యూయోట్. అలా లెజెండరీ కమెడియన్ రాజబాబుతో మొదటి డ్యూయెట్ చేసే అదృష్టాన్ని శ్రీదేవి దక్కించుకుంటే.. అతిలోక సుందరితో డ్యూయెట్ చేసే అదృష్టం కమెడియన్ రాజబాబుకు దక్కింది. ఇక ఆ తరవాత శ్రీదేవి వరుస ఆఫర్ లతో దూసుకుపోయింది.
ఆ తర్వాత ఆమెకు వరుస హిట్లు రావడంతో తన కెరీర్ లోస్టార్ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేనంతగా బిజీ అయిపోయింది. స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ లు అందుకోవడమే కాకుండా… ఎంతటి హీరో అయినా తాను నటించాలంటే కండిషన్స్ పెట్టే స్థాయికి ఎదిగింది. ఇక ప్రేక్షులకు వినోదాన్ని పంచిన రాజబాబు – శ్రీదేవి ఇప్పుడు మన మధ్యన లేకపోయినా వారు చేసిన సినిమాల వల్ల వారి జ్ఞాపకాలు మాత్రం కలకాలం మన మధ్యనే ఉంటాయి.