అన్ని బంధాల్లో కెల్లా రక్తసంబంధం చాలా గొప్పది. ఈ సామెత తెలుగు ఇండస్ట్రీకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆస్తుల పంపకాలు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీని పంచుకున్న అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఇండస్ట్రీలో ఉన్నారు చాలామంది ఇప్పటికే కుటుంబ వారసత్వంతో స్టార్ హీరోలు హీరోయిన్లు అయిన వారు ఉన్నా కొంతమంది మాత్రం తోబుట్టువులు అనే విషయం ఇప్పటికీ మనకు తెలియదు. అలా సౌత్ ఇండియన్ యాక్టర్స్ చాలామంది తోబుట్టువులు వీళ్లేనా అని మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే వారి ఇరువురు వేరువేరుగా మనకు తెలిసినప్పటికీ రక్త సంబంధీకులు అన్న విషయం మాత్రం మనకు తెలియదు. అలా మనకు తెలియని ఆ అన్నదమ్ములు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఓంకార్ బ్రదర్స్ :
యాంకర్ మరియు డైరెక్టర్ అయిన ఓంకార్ కి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అనే విషయం ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికే తెలుసు. ఇటీవల రాజు గారి గది సినిమాతో ఒక తమ్ముడిని హీరోని చేసినా ఓంకార్ మరొక తమ్ముడిని అదే సినిమాకి ప్రొడ్యూసర్‌ను చేశారనే విషయం చాలామందికి తెలియదు. వీరి ముగ్గురు కలిసి ఇప్పటికే రాజు గారి గది సినిమాకు రెండు సీక్వెల్స్ తీసుకొచ్చారు.
హీరో విశాల్ బ్రదర్ :
హీరో విశాల్ కి తమ్ముడు ఉన్నాడనే విషయం మనలో చాలామందికి తెలీదు. విశాల్ తమ్ముడు పేరు విక్రమ్ కృష్ణ అతడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతున్నాడు తమిళంలో ప్రొడ్యూసర్ గా పలు సినిమాలు తీశాడు. విశాల్ కెరీర్ స్టార్టింగ్‌లో వచ్చిన హిట్ సినిమాలకు అతడే నిర్మాత. జీవీకే ప్రొడక్షన్ బ్యానర్‌పై విక్రమ్ కృష్ణ నిర్మాతగా విశాల్ హీరోగా చాలా సినిమాలు వచ్చాయి. విశాల్ పొగరు సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రీయారెడ్డిని విక్రమ్ కృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నాడు.
హీరో శ్రీకాంత్ బ్రదర్ :
హీరో శ్రీకాంత్ కి ఒక తమ్ముడు ఉన్నాడనే విషయం మీలో ఎంతమందికి తెలుసు. అతడు కూడా హీరోనే. మహేశ్వరి హీరోయిన్ గా హీరో శ్రీకాంత్ తమ్ముడు అనిల్ హీరోగా ఎందుకంటే చెప్పమ్మా అనే ఒక సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత కాలంలో నిర్మాణం చేపడుతూ అనిల్ మేక ప్రొడ్యూసర్ గా సెటిల్ అయిపోయాడు.
Am రత్నం సన్స్ :
7 జి బృందావన్ కాలనీ హీరో రవి కృష్ణ మీకు అందరికీ గుర్తుండే ఉంటాడు. ఏ ఏం రత్నం కొడుకుగా రవికృష్ణ ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయ్యాడు అయితే రవికృష్ణకి ఒక తమ్ముడు ఉన్నాడనే విషయం బయట ప్రపంచానికి తెలియదు. రవికృష్ణ హీరోగా తన యాక్టింగ్ ని పక్కన పెట్టి తమ్ముడు జ్యోతి కృష్ణతో కలిసి దర్శకుడిగా మారాడు. వీరిద్దరూ కలిసి కేడి, ఉహ్ లా లా లా అనే సినిమాలు తీశారు.
జయం రవి బ్రదర్ :
జయం రవి తమిళంలో మంచి హీరోగా కొనసాగుతున్నాడు. జయం రవి ఎవరో కాదు సీనియర్ ఎడిటర్ అయిన ఎడిటర్ మోహన్ కుమారుడు. జయం రవి తమ్ముడు మోహన్ రాజా మన తెలుగులో అప్పుడెప్పుడో వచ్చిన హనుమాన్ జంక్షన్ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇదే మోహనరాజా చిరంజీవి హీరోగా వస్తోన్న లూసీఫర్ రీమేక్ గాడ్‌ఫాథర్ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.
పూరి జగన్నాథ్ బ్రదర్ :
పూరి జగన్నాథ్ తమ్ముడు అయినా సాయిరాం శంకర్ గురించి కూడా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికే. తెలుసు ఒకటి రెండు సినిమాలతో హీరోగా నిలదొక్కుకో లేకపోయినా సాయిరాం శంకర్ మళ్లీ ఇప్పుడు హీరోగా మరో సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే సాయిరాం శంకర్ పూరి జగన్నాథ్ అని చాలామందికి తెలియకపోవడం విశేషం.
శ్రీదేవి, ప్రీతి , వనిత :
జూనియర్ శ్రీదేవిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీదేవికి ఇద్దరు అక్కలు ఉన్నారనే విషయం మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికే తెలుసు. రుక్మిణి కళ్యాణం తో హీరోయిన్ గా పరిచయమైన ప్రీతి.. అలాగే దేవి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన వనిత ఇద్దరూ కూడా శ్రీదేవి అక్కలే. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళు అలనాటి ప్రముఖ నటి మంజుల కుమార్తెలు. వీరిలో ప్రీతి ప్రముఖ సింగం సీరిస్ సినిమాల దర్శకుడు సింగం హరిని పెళ్లాడింది. వనితా విజయ్ కుమార్‌కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యి పెటాకులు అయిన సంగతి తెలిసిందే.
రాధిక – నిరోషా :
సీనియర్ నటి రాధిక తెలుగుతో పాటు తమిళంలో ఎన్నో హిట్ సినిమాలు చేసింది. ఆమె ఒకప్పటి తమిళ నటుడు ఎంఆర్. రాధా కుమార్తె. ఆమె తొలి రెండు పెళ్లిళ్లు ఫెయిల్ అయ్యాయి. మూడోసారి ముచ్చటగా తమిళ సీనియర్ నటుడు శరత్‌కుమార్‌ను పెల్లి చేసుకుంది. ఇక ఆమె సోదరే మరో హీరోయిన్ నిరోషా. తెలుగులో బాలయ్య నారినారి నడుమ మురారి, చిరంజీవి స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్ సినిమాలు చేసింది. ఆమె మరో హీరో రాంకీని ప్రేమ వివాహం చేసుకుంది. ఇక వీళ్లతో పాటు హీరోయిన్లు నగ్మా, జ్యోతిక, రోషిణి కూడా అక్కచెళ్లెల్లే కావడం విశేషం. అయితే వీరి తండ్రులు వేరు.