Moviesబాల‌కృష్ణ‌కు ' యువ‌ర‌త్న ' బిరుదు ఎలా వ‌చ్చిందో తెలుసా...!

బాల‌కృష్ణ‌కు ‘ యువ‌ర‌త్న ‘ బిరుదు ఎలా వ‌చ్చిందో తెలుసా…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ కెరీర్‌లో ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూశాడు. బాల‌య్య ప‌డిన ప్ర‌తిసారి ఓ బంప‌ర్ హిట్టో లేదా ఇండ‌స్ట్రీ హిట్లో ఇచ్చి లేస్తూ ఉంటాడు. బాల‌య్య తండ్రి ఎన్టీఆర్‌కు న‌ట‌ర‌త్న అనే బిరుదు ఉంది. ఆయ‌న సినీ వార‌సుడిగా వ‌చ్చిన బాల‌య్య యువ‌ర‌త్న బిరుదుతో ఓ వెలుగు వెలిగాడు. తండ్రి న‌ట‌ర‌త్న‌కు త‌గ్గ వార‌సుడు యువ‌ర‌త్న అనిపించుకున్నాడు. బాల‌య్య‌కు చాలా బిరుదులే ఉన్నాయి. న‌ట‌సింహం – గోల్డెన్ స్టార్ – బాక్సాఫీస్ బొనంజా – యువ‌ర‌త్న – ల‌య‌న్ ఇలా అనేక ముద్దుపేర్ల‌తో బాల‌య్య‌ను అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు.

అస‌లు బాల‌య్య‌కు యువ‌ర‌త్న బిరుదు ఎలా ? వ‌చ్చింది. ఈ బిరుదు వెన‌క ఉన్న స్టోరీ ఏంటో తెలిస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలే క‌నిపిస్తాయి. ఎన్టీఆర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాత‌మ్మ క‌ల సినిమాతో బాల‌య్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ స్టార్టింగ్‌లో తండ్రితో క‌లిసి ఎక్కువ సినిమాలు చేయ‌డం.. త‌ర్వాత కొన్ని సోలో సినిమాలు చేసినా స్టార్టింగ్‌లో క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ రాలేదు.

బాల‌య్య‌కు కెరీర్ స్టార్టింగ్‌లో భార్గ‌వ్ ఆర్ట్స్ బ్యాన‌ర్లో కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన సినిమాలే క‌మ‌ర్షియ‌ల్‌గా బ్రేక్ ఇచ్చి తిరుగులేని హీరోను చేశాయి. ఈ లిస్టులోదే 1989లో వ‌చ్చిన ముద్దుల మావ‌య్య సినిమా. బాల‌కృష్ణ – విజ‌య‌శాంతి జంట‌గా న‌టించిన ఈ సినిమా చెల్లి సెంటిమెంట్‌తో తెర‌కెక్కింది. న‌టి సీత ఇందులో బాల‌య్య‌కు చెల్లి పాత్ర‌లో న‌టించింది.

ఈ సినిమా ఆ యేడాది రిలీజ్ అయిన సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాగా నిలిచి ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. చెల్లి సెంటిమెంట్ యావ‌త్ తెలుగునాట ఓ ఊపు ఊపేసింది. రిపీటెడ్ ఆడియెన్స్ థియేట‌ర్ల‌కు పోటెత్తారు. ఈ సినిమా కూడా సిల్వ‌ర్ జూబ్లి జ‌రుపుకుంది. బాల‌య్య‌ను టాప్ హీరోల లీగ్‌లోకి తీసుకువ‌చ్చేసింది. అలాగే ఈ సినిమాతోనే బాల‌య్యకు యువ‌ర‌త్న బిరుదు యాడ్ అయ్యిది. ఈ సినిమా ప్ర‌భావం తెలుగు నాట మూడు నాలుగేళ్లు గ‌ట్టిగా ప‌డింది. బాల‌య్య అంత‌లా మాస్‌, మ‌హిళాభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు.

అక్క‌డ నుంచి బాల‌య్య టాలీవుడ్ టాప్ -4 హీరోల జాబితాలోకి చేరిపోవ‌డంతో పాటు స్టార్ హీరో ప్లేస్ కోసం ఎప్ప‌టిక‌ప్పుడు పోటీలో ఉంటూనే ఉన్నాడు. ముద్దుల మావ‌య్య సినిమాకు మూలం త‌మిళ సినిమా త‌న్గ‌చి ప‌డిచావాకి. దీనికి రీమేక్‌గా ముద్దుల మావ‌య్య వ‌చ్చింది. త‌ర్వాత ఈ సినిమా బాలీవుడ్‌లో ఆజ్ కా అర్జున్‌గా, క‌న్న‌డంలో ర‌విమామ‌గా, బెంగాలీలో పబిత్రపాపీ రీమేక్ అయ్యి హిట్ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news