అన్నగారు ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎంతో మంది సినిమాల్లోకి వచ్చారు. ఆయన కుమారులు.. మనవ లు కూడా ఇప్పుడు రాణిస్తున్నారు. హీరోలుగా.. తమకీర్తిని ప్రపంచానికి చాటుతున్నారు. ఒకరిద్దరు నిలదొ క్కు కోలేక పోయినా.. మిగిలిన వారు సినీ రంగంలోనే ఎడిటింగ్, నిర్మాతలుగా.. సమర్పకులుగా వ్యవహరి స్తున్నారు. అయితే.. అన్నగారి కుటుంబంపై ఒక అపవాదు ఉంది. ఈ కుటుంబం నుంచి పురుషులు మాత్రమే రంగంలోకి రావడం ఏంటనేది ఆ విమర్శ.
సహజంగానే అప్పట్లో సినీ ప్రముఖులు ఎవరూ కూడా తమ పిల్లలను ఈ రంగంలోకి తీసుకువచ్చేవారు కాదు. ఈ ఫీల్డ్‌లో వ్యసనాలు ఎక్కువని.. అందుకే దూరం పెడుతున్నామని.. బహిరంగంగానే చెప్పేవారు. కానీ, అన్నగారు మాత్రం తన నలుగురు కుమారులను కూడా ఈ ఫీల్డ్‌లోకి తీసుకువచ్చారు. నందమూరి రామకృష్ణ ఎడిటింగ్, సమర్పకులుగా ఉంటే.. హరికృష్ణ, బాలకృష్ణల గురించి అందరికీ తెలిసిందే. ఇక, నందమూరి మోహన్ కృష్ణ కొన్నాళ్లు.. నిర్మాణ బాధ్యతలు చూశారు. ఆయన మరో కుమారుడు జయకృష్ణ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు.
ఇదిలావుంటే.. అన్నగారి కుటుంబం నుంచి మహిళలు ఎవరూ సినిమాల్లోకి రాలేదా? అంటే.. వచ్చారు. ప్రస్తుతం బీజేపీ నాయకురాలిగా ఉన్న.. దగ్గుబాటి పురందేశ్వరి.. శ్రీకృష్ణావతారం సినిమాలో బుల్లి కృష్ణుడి వేషం వేశారు. తర్వాత.. ఆమె ఇంటికే పరిమితం అయ్యారు. దీనికి కారణం.. అన్నగారు ఆమెను ప్రోత్సహించాలని అనుకున్నా.. అన్నగారి సతీమణి.. బసవతారకం మాత్రం.. చదువు ఎక్కడ దూరం అవుతుందోననే భయంతో పిల్లలను సినిమాల్లోకి రానివ్వలేదు.
మరోవైపు పురందేశ్వరి నటించిన సినిమాలో మరో చిత్రమైన ఘటన జరిగింది. సినిమా ఎడిటింగ్‌లో ఆమె సీన్‌ను పూర్తిగా కట్ చేశారు. ఇక, ఆతర్వాత.. ఆమె సినిమాలకు పూర్తిగా దూరం కావడంతో అన్నగారి కుటుంబం నుంచి మహిళలు ఎవరూ కూడా సినిమాల్లో లేకుండా పోయారు. ఇక, అక్కినేని కుటుంబంలోనూ.. ఇలానే జరిగింది. ఆయన ఇద్దరు కుమారులు కూడా సినిరంగంలో ఉన్నారు.కానీ, కుమార్తెలు మాత్రం వైద్య రంగంలో స్థిరపడ్డారు.