టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రాజు ఈ రోజు తెలుగు సినిమా రంగాన్ని చాలా వరకు శాసిస్తున్నాడనే చెప్పాలి. 2003లో దిల్ సినిమాతో నిర్మతగా మారిన రాజు తక్కువ టైంలోనే 50 సినిమాలు నిర్మించాడు. రాజు బ్యానర్లో వచ్చిన సినిమాల్లో సక్సెస్ రేటు 80 శాతం వరకు ఉందంటేనే రాజు జడ్జ్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పాలి.
ఈ క్రమంలోనే రాజు తన బ్యానర్లో ఇప్పుడు రెండు పాన్ ఇండియా లెవల్ క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాడు. రామ్‌చరన్ – శంకర్ కాంబినేషన్లో సినిమాతో పాటు వంశీ పైడిపల్లి, కోలీవుడ్ సూపర్‌స్టార్ విజయ్ కాంబినేషన్లో కూడా మరో పాన్ ఇండియా ప్రాజెక్టు నిర్మిస్తున్నాడు. అది కాక ఈ నెలలో నాగచైతన్యతో తీసిన థ్యాంక్యూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక దిల్ రాజు మొదటి భార్య అనిత హఠాన్మరణంతో ఆయన చనిపోవడంతో రాజు తన కుమార్తె హర్షిత ఒత్తిడి మేరకు రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2020లో రాజు కుమార్తె హర్షిత పట్టుబట్టి మరీ తన తండ్రికి తేజస్వినితో రెండో పెళ్లి చేసింది. కరోనా లాక్‌డౌన్ టైంలో నిజామాబాద్ జిల్లాలో దిల్ రాజు సొంత ఊళ్లో ఈ పెళ్లి జరిగింది.
ఇక రాజు భార్య తేజస్విని తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజుకు ఇప్పటి వరకు ఓ కుమార్తె మాత్రమే ఉండగా.. 50 సంవత్సరాల ఏజ్‌లో రాజు మగబిడ్డకు జన్మనివ్వడం.. ఆయనకు వారసుడు రావడం విశేషమే అన్నారు ఇండస్ట్రీ వాళ్లు. ఇక రాజు రెండో భార్య తేజస్విని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అంటున్నారు.
రాజుకు తేజస్వినికి మధ్య 15 ఏళ్లకు పైగానే గ్యాప్ ఉందని తెలుస్తోంది. ఇక రాజు రెండో భార్యలో మంచి రైటర్ ఉన్నాడట. ఆమె స్వతహాగా కథలు రాస్తుందని కూడా సమాచారం. రాజు కథల జడ్జ్‌మెంట్‌లో కింగ్. ఇక తేజస్విని కూడా ఈ విషయంలో రాజుకు తోడు అయితే ఆమెకు కూడా కథల జడ్జ్‌మెంట్‌లో తన బ్యానర్‌కు, భర్తకు మరింత హెల్ఫ్ అవుతుందనడంలో డౌట్ లేదు.