సినిమా రంగంలో హీరోయిన్లు, హీరోలకూ సన్నిహిత సంబంధాలు ఉండటం కామన్. ఇదే క్రమంలో కొందరు హీరోయిన్లు, దర్శకులకూ మధ్య కూడా అంతర్గత సంబంధాలు ఎక్కువే ఉంటాయి. ఇప్పటి నుంచే కాదు.. 1970వ దశకం నుంచే ఉంది. ఆ సమయంలోనే కొందరు హీరోయిన్‌లు తమ కెరీర్ కోసం, సినిమాలలో అవకాశాల కోసం దర్శకులతో సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టారు. ఇక ప్రస్తుతం చాల మంది స్టార్ హీరోయిన్‌లు.. స్టార్ దర్శకులకు చేతుల్లో బొమ్మలుగా మారిపోతున్నారు. అప్పట్లో సీనియర్ హీరోయిన్ రాధ, శోభన్‌బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా షుటింగ్ జరుగుతుంది.
ఆ సినిమాను డైరక్ట్ చేస్తున ఓ సీనియర్ డైరక్టర్ రాధను చూసి అమె మైకంలో పడిపోడాడు అని.. వెంటనే శోభన్‌బాబు ఆ దర్శకుడికి గీతోపదేశం చేసాడు అంటూ సీనియర్ దర్శకుడు గీతకృష్ణ చెప్పారు. 1980వ దశకంలో దర్శకుడిగా మారిన గీతాకృష్ణ తన కేరియర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు తీయలేదు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. సినిమా రంగంలో నాటి నుంచి నేటి వరకు జరుగుతున పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నాడు.
ఈ క్రమంలోనే శోభన్‌బాబు – రాధ కాంబినేషన్‌లో వచ్చిన ఓ సినిమా షూటింగ్ మద్రాస్‌లో జరుగుతుంది అట. విజయ స్టూడియోలో ఒక పాట షుట్ చేస్తున్నప్పుడు రాధ పెదాలకు లిప్‌టిక్ పూసుకుని అద్దంలో చూసుకుంటోంది అట. ఆమే అటు మేకప్‌ను అద్దంలో… ఇటు దర్శకుడి వైపు చూస్తుండడంతో ఆ డైరక్టర్ రాధ తనే చూస్తున్నదని మూసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడట. రాధ అటు మేకప్ సరిచేసుకుంటూ.. ఇటు ఆ డైరక్టర్ వైపు చూస్తుండడంతో ఆమె తననే చూస్తుందన్న భ్రమలో ఉండిపోయాడట.
అయితే ఇదంతా చూసిన శోభన్‌బాబు ఆ దర్శకుడిని పిలిచి ఓయ్ రెడ్డి.. నువ్వు డైరక్టర్ గా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నావు.. ఇలాంటివి అన్ని మామూలే.. వీళ్లను అస్సలు నమ్మొద్దు అని చెప్పారట. ఈ హీరోయిన్‌లు నన్ను ఇక్కడ వాటేసుకుని.. నావెనకాల ఉన్న వ్యక్తికి హాయ్ చెప్తూ ఉంటారని.. ఈ దొంగ ముక్కలను అస్సలు నమ్మవద్దు అని చెప్పారట. ఈ విషయని ఆ షుటింగ్ లో ఉన్న వారు తనకు చెప్పారని గీతాకృష్ణ తెలిపారు.
ఆ దర్శకుడు ఎవరన్న విషయని గీతాకృష్ణ చెప్పకపోయినా… ఆయన చాలా మంచి వ్యక్తి అని.. కమర్షియల్ గా మంచి విజయాలు నమోదు చేశారని… చిరంజీవితో ఎన్నో హిట్ సినిమాలు తీశాడని చెప్పారు. అయన పేరు ఓయ్ రెడ్డి అన్ని పదంతో పిలిచాడని చెప్పడంతో ఆయన చెప్పిన పేరు కోదండరామిరెడ్డి అని అర్థమౌతుంది. అలా నాటి సంఘటనను గీతాకృష్ణ ఇప్పుడు బయటపెట్టారు.