సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఒకప్పుడు సౌత్ ఇండియాను ఓ ఊపు ఊపేసింది. తమిళంలో రజినీకాంత్, కమల్‌హసన్, శరత్ కుకూమార్, విజయకాంత్ లాంటి స్టార్ హీరోలతో సూపర్ డూపర్ హిట్‌లు ఇచ్చింది. అలాగే తెలుగులోనూ ఏఎన్నార్, ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో హిట్ సినిమాలలో నటించింది. రాధిక – చిరంజీవిది గొప్ప హిట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించారు. రాధిక సినిమా జీవితంలో ఎంత పాపులర్ అయినా.. అమె వ్యక్తిగత జివితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అమె ముందుగా ప్రముఖ మాలయాళ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతెన్‌నూ పెళ్ళి చేసుకున్నారు. అయితే యేడాదికే వీరి మధ్య మనస్సర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత లండన్ లో ఉన్న ఎన్నారై ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప జన్మించిన అనంతరం వీరు కూడా విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తనతో పాటు నటించిన శరత్ కూమర్‌ను అమె ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే శరత్ కూమర్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వగా.. రాధిక శరత్ కూమార్‌ను మూడో పెళ్లి చేసుకుంది.
4 ఫిబ్రవరి, 2001న వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. రాధిక సీనియర్ నటుడు ఎంఆర్. రాధ కూమార్తె. హీరోయిన్ నీరోష రాధికకు స్వయాన చెల్లి. ఇక రాధిక తన రెండో భర్త అయన బ్రిటిష్ వ్యక్తి రిచర్డ్ హార్టీతో రెండో వివాహం జరిగింది. వారిద్దరికి జన్మించిన కూమార్తె రాయనే హార్టీ. ఈ వయసులో రాధిక ఎఫైర్ లు గురించి ప్రస్తావించటం కరెక్ట్ కాదు.. కానీ ఆమె మెగాస్టార్ చిరంజీవి, కోలివుడ్ స్టార్ హీరో విజయకాంత్ తో ఎపైర్లు పెట్టుకుందన్న పుకార్లు అప్పట్లో బాగా వినిపించాయి.
రెండో భర్త మోసం చేయడంతో ఆస్తులన్ని పొగొట్టుకున్న రాధిక రూ. 2 కోట్లు అప్పుతో తిరిగి ఇండియా వచ్చింది. ఆ సమయంలో తన రాడాన్ బ్యానర్ పై బుల్లితెరపై సీరియల్స్ నిర్మించడం ద్వారా తిరిగి సక్సెస్ అయ్యారు. ఇక రాధికకూ రెండో భర్త ద్వారా జన్మించిన రాయనే హార్డీ కర్నాకట స్టార్ క్రికెటర్ అభిమన్యు మిథున్ ప్రేమ వివహం చేసుకున్నారు. అభిమన్యు ఐపీఎల్ లో బెంగుళుర్ తరపున ఆడాడు. బెంగళూరులో మ్యాచ్ జరుగుతున్న సమయంలో వీరిద్దరికి ఏర్పడిన స్నేహం ప్రేమగా మరి.. పెళ్లి వరకు వెళ్లింది. అలా స్టార్ క్రికెటర్ గా ఉన్న అభిమన్యు మిథున్ రాధిక అల్లుడుగా మరాడు.