సినీ రంగంలో తనదైన నటనతో వెండితెరను మరో మలుపు తిప్పిన అన్నగారు ఎన్టీఆర్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన అభినయం.. వర్చస్సు, డైలాగులు.. పాటలు, డ్యాన్స్ .. ఇలా ఏది తీసుకు న్నా.. ఆయనకు ఆయనే సాటి. తెలుగు సినీ రంగంలో ఆయన వేసిన ముద్ర అజరామరం. అయితే.. ఆయనకు మాస్ ముద్ర ఉండేది. పౌరాణిక చిత్రాల్లోను.. జానపద చిత్రాల్లోనూ ఆయన వేసిన వేషాలతో మాస్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు.
పైగా అన్నగారి హావభావాలు సైతం అలానే ఉండేవి. దీంతో అన్నగారి లుక్ నుంచి అన్నీ కూడా మాస్‌ను కట్టి పడేసేవి. దీనికితోడు గుండమ్మ కథ, కలసి ఉంటే కలదు సుఖం వంటి సినిమాలతో ఆయన మాస్ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో క్లాస్ పీపుల్ ఆయనకు కనెక్ట్ కాలేక పోయారు. మరోవైపు అన్నగారికి పోటీగా సినీరంగంలో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎన్ని మాస్ మూవీల్లో నటించినా.. ఆ ముద్ర పడలేదు.
క్లాస్ హీరోగానే అక్కినేని ప్రచారం పొందారు. దీంతో ఎన్టీఆర్‌కు క్లాస్ మూవీల్లో ఆఫర్లు తగ్గాయనే ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలోనే `గజదొంగ` మూవీ ఆఫర్ వచ్చింది. ఇది క్లాస్+మాస్ కలబోత. ఒకవైపు క్లాస్‌గా ఉంటూనే మరోవైపు మాస్ యాంగిల్ చేయాలి. దీనికోసం.. అంటే.. క్లాస్‌గా కనిపించడం కోసం.. పొట్ట తగ్గించాలంటూ.. డైరెక్టర్ సహా నిర్మాతలు ఒత్తిడి తెచ్చారు. ఇక, అప్పటికే.. క్లాస్‌గా తనకు ముద్ర లేకపోవడంతో అన్నగారు చాలా కష్టించారు.
చివరకు క్లాస్ కథానాయకుడు అని అనిపించుకోవడం కోసం.. ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకుని.. పొట్ట తగ్గించేందుకు నానా ప్రయాస పడ్డారని.. అంటారు. మొత్తానికి గజదొంగలోని కొన్ని సీన్లలో మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. తర్వాత తర్వాత షూటింగ్ లేటు కావడంతో చివరకు వచ్చే సరికి.. అన్నగారి మాస్ లుక్‌ను దాచలేక పోయారు. ఏదేమైనా.. మాస్ నాయకుడిగానే ఆయన పేరు తెచ్చుకున్నారనేది సినీ వర్గాల మాట.