ఇప్పుడు అయితే తెలుగు సినిమా ఖ్యాతి దేశ ఎల్లలు దాటి ప్రపంచవేతంగా విస్తరిస్తూ వస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఇటు సౌత్‌లో తమిళ్‌నాడులోనూ… అటు నార్త్‌లోను హిందీ వాళ్ళు చాలా చులకనగ చూసేవారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో ఎక్కువుగా తెలుగు సినిమాలను తమిళ్ స్టార్ హీరోలు, ఇటు బాలీవుడ్ స్టార్ హీరోలు రీమేక్‌లు చేసుకునేవారు. ఆ తర్వాత 1990వ దశకం దాటాక తెలుగు సినిమాలు అంటే చిన్న చూపు చూసినా.. ఇప్పుడు మాత్రం యావత్ భారతదేశం మొత్తం తెలుగు సినిమా వైపే చూస్తుంది.
ఒకప్పుడు తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు కూడ తక్కువుగా వచ్చేవి. ఎప్పుడు అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారో అప్పటి నుంచి తెలుగు సినిమా పట్ల జాతీయ స్థాయిలో మరింత చిన్న చూపు మొదలైందన్న చర్చలు కూడ అప్పట్లో ఉన్నాయి. ఎన్టీఆర్ ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి యాంటీగా ఉండేవారు. ఆ తర్వాత ఆదే కాంగ్రెస్ పార్టీ నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పెట్టారు. దీంతో తెలుగు సినిమా అంతా అప్పట్లో ఎక్కువగా ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచింది.
అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలుగు సినిమాకు ఒక అవార్డు కూడా ఇచ్చేందు ఇష్టపడేది కాదట. వాస్తవానికి ప్రాంతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరిలో ఏదో ఒక సినిమాకు అవార్డు ఇవ్వవలిసి ఉంటుంది. ఆ అవార్డును కూడా కేంద్రం ఆపేసింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును కూడా కేంద్రం రెండు, మూడు సంవత్సరాలు పాటు అపేసింది అంట. ఇదే విషయాన్ని సినీయర్ దర్శకుడు గీతాకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణ నటించిన సంకీర్తన సినిమాకు జాతీయ ఆవార్డు రావలసి ఉందని అయన అభిప్రాయపడ్డారు.
1987 జాతీయ అవార్డులకు జ్యూరీ మెంబర్‌గా ఉన్న షావుకారు జానకీ సైతం మన తెలుగు సినిమాలలో ఒక సినిమాకు జాతీయ ఆవార్డు రావల్సి ఉందని చెప్పారని.. ఆమె చెప్పింది సంకీర్తన సినిమా గురించే అని గీతాకృష్ణ తెలిపారు. కేవలం ఎన్టీఆర్ పై ఉన్న కోపంతో నాటి కేంద్ర ప్రభుత్వం సంకీర్తన సినిమా బాగున్నా అవార్డు ఇవ్వలేదని.. అది ఒక సంకీర్తన సినిమాకు జరిగిన అన్యాయం కాదు.. ఒక మూడు, నాలుగు సంవత్సరాల పాటు తెలుగు సినిమాలకు ఇలానే అన్యాయం జరిగిందని గీతాకృష్ణ చేప్పారు.
ఇక గీతాకృష్ణ సంకీర్తన సినిమాకు ప్రేక్షకుల కంటే విమర్శకుల నుంచి మంచి పేరు వచ్చింది. కోణార్క క్రియేషన్ బ్యానర్ పై ఎం.గంగయ్య ఈ సినిమా నిర్మించారు శరత్‌బాబు ఇందులో కీలక పాత్రలో నటించగా.. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించారు.