టాలీవుడ్‌లో కొరటాల శివకు నమ్మకమైన డైరెక్టర్‌గా మంచి పేరు ఉండేది. కొరటాల ఆచార్యకు ముందు తీసిన నాలుగు సినిమాలే ఆయన ఏ రేంజ్ డైరెక్టరో చెపుతాయి. అయితే కొరటాలకు ఉన్న ఆ ఇమేజ్ అంతా ఆచార్యతో రివర్స్ అయ్యింది. అసలు శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, మిర్చి, భరత్ అనే నేను సినిమాలు తీసిన కొరటాల శివేనే ఆచార్య తీసింది ? అన్న సందేహాలు వచ్చేంత దారుణంగా ఆ సినిమా ప్లాప్ అయ్యింది.
ఆచార్య తర్వాత బాగా డిజప్పాయింట్ అయిన కొరటాల ఇప్పుడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలతో పాటు కాస్టింగ్‌ను సెట్ చేసే ప్రక్రియ నడుస్తోంది. యువసుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో కొరటాల తానేంటో ఫ్రూవ్ చేసుకోవాలని కసితో వర్క్ చేస్తున్నాడు.
ఇటు ఎన్టీఆర్ ఆరు వరుస హిట్లతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఈ టైంలో అలాంటి హీరోతో ఓ భారీ పాన్ ఇండియా హిట్ పడితే కొరటాల రేంజ్ కూడా మారిపోతుంది. పైగా కొరటాల ఇప్పటి వరకు పాన్ ఇండియా కథలు తీసుకోలేదు. తనకన్నా వెనక వచ్చిన డైరెక్టర్లు అందరూ పాన్ ఇండియా ప్రాజెక్టుల వెంట పడిపోతున్నారు. ఇక కొరటాల కూడా ఇప్పుడు రిస్క్ చేయక తప్పట్లేదు.
అందుకే ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్‌తో పాన్ ఇండియా స్టార్ అవ్వగా.. ఇప్పుడు ఆ క్రేజ్‌ను కూడా తన సినిమాకు క్యాష్ చేసుకునే క్రమంలోనే కొరటాల ఎన్టీఆర్ సినిమాకు పాన్ ఇండియా కథనే తీసుకున్నాడు. ఎన్టీఆర్ సినిమా తర్వాత కూడా కొరటాల మళ్లీ పాన్ ఇండియా కథనే రెడీ చేసుకుంటున్నాడట. పుష్పతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమా తర్వాత బన్నీ – కొరటాల కాంబోలో సినిమా రానుందని తెలుస్తోంది. ఈ లోగా బన్నీ పుష్ప 2 పూర్తి చేసి కొరటాల సినిమా కోసం రెడీగా ఉంటాడు. రెండేళ్ల క్రితం కరోనా టైంలోనే కొరటాల బన్నీకి కథ చెప్పాడట. ఆ కథ బన్నీకి నచ్చడంతో ఆ కథతోనే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటున్నారు.