Moviesబాలయ్య - వివి.వినాయక్ కాంబినేషన్లో రెండో సినిమా ఆ కారణంతోనే మిస్సయిందా..!

బాలయ్య – వివి.వినాయక్ కాంబినేషన్లో రెండో సినిమా ఆ కారణంతోనే మిస్సయిందా..!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత తన కెరీర్ లోనే ఎప్పుడూ లేనంత‌ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో గత ఏడాది డిసెంబర్లో విడుద‌లైన‌ అఖండ సినిమా బాలయ్య కెరియర్ లోనే బ్లాక్ బ‌స్టర్ హిట్‌గా నిలిచింది. గతంలో బోయపాటి – బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సింహ – లెజెండ్ సినిమాలను మించి అఖండ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. బాలయ్య కెరీర్ లో ఇప్పటి వరకు రు. 100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా ఏదీ లేదు. అలాంటిది అఖండ ఏకంగా థియేటర్ ద్వారానే రు. 150 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ఓవరాల్ గా రు. 200 కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది.

పైగా కరోనా సెకండ్ వేవ్‌ తర్వాత టికెట్ రేట్లు తక్కువగా ఉండి… ప్రేక్షకులు సినిమాల‌ను చూసేందుకు థియేటర్లకు వస్తారా ? అన్న సందేహాలను అఖండ పటాపంచలు చేసింది. ప్రస్తుతం అఖండ సక్సెస్ తో బాలయ్య వరుస పెట్టి క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. క్రాక్ లాంటి సూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న‌ బాలయ్య.. ఈ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి సినిమా కమిట్ అయ్యాడు. అనిల్ రావుపూడి సినిమా పూర్తి అయిన వెంటనే బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్ సినిమాలను పట్టాలెక్కించేయనున్నారు.

ఇదిలా ఉంటే బాలయ్య కెరీర్లో 2002లో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా ఎప్పటికీ ఒక స్పెష ల్. స్టార్ డైరెక్టర్ వినాయ‌క్‌ కెరీర్ లో ఆది తర్వాత రెండో సినిమాగా చెన్నకేశవరెడ్డి తెరకెక్కింది. బాలయ్య – వినాయక్ కాంబినేషన్లో చెన్నకేశవరెడ్డి సినిమా వస్తుందన్న ప్రకటన వచ్చినప్పటి నుండే టాలీవుడ్ లో ఒక్కసారిగా భారీ హైప్ వచ్చింది. ఈ సినిమా కథ పరంగా బాగున్నా… ట్రీట్మెంట్ పరంగా కొన్ని లోపాలు ఉండడంతో అనుకున్న స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. అయితే సినిమాకు, డైరెక్టర్ వినాయక్ కూ మంచి పేరు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాలయ్య ఒకరోజు వినాయక్‌ని పిలిచి ఈ సినిమా రిజల్ట్ తో నాకు సంబంధం లేదు అని.. సినిమా చేస్తున్నంతసేపు తాను ఎంజాయ్ చేశానని… నువ్వు నాతో మళ్లీ ఎప్పుడు సినిమా తీయాలనుకున్నా కథను రెడీ చేసుకుని వచ్చి తనకు చెప్పమని కోరాడ‌ట‌.

ఈ విషయం వినాయక్‌ కూడా చాలా సందర్భాల్లో ఓపెన్ గా కూడా చెప్పారు. చెన్నకేశవరెడ్డి తర్వాత బాలయ్య – వినాయక్ కాంబినేషన్లో మళ్లీ ఎప్పుడు సినిమా వస్తుందని అని అందరూ ఎదురు చూస్తున్నారు. చెన్నకేశవరెడ్డి 2002 లోనే మరోవైపు ఇంద్ర సినిమా పోటీగా ఉన్నా కూడా 42 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. బాలయ్య బాబుకు తాను ఎక్కడ కనిపించినా సత్తిరెడ్డి అని ముద్దుగా పిలుచుకుంటారు అని వినాయక్ చెప్పారు. ఇక బాలయ్యతో మరో సినిమాా చేయాలని తాను ఎప్పటినుంచో అనుకుంటున్నా కుదరటం లేదని ఆయన అన్నారు. నిర్మాత సి కళ్యాణ్ బాలయ్యతో పరమవీరచక్ర – జై సింహా – రూలర్ మూడు సినిమాలు నిర్మించారు.

ఈ క్రమంలోనే ఇంటిలిజెంట్ సినిమా తర్వాత బాలయ్య హీరోగా తన దర్శకత్వంలో సి కళ్యాణ్ బ్యానర్ లో ఒక సినిమా చేయాలని అనుకున్నామని… ఆ సినిమా కోసం చాలా కథలు విన్నా.. ఏది నచ్చకపోవటంతో కుదరలేదు అని వినాయక్ తెలిపారు. ఇంటిలిజెంట్ ప్లాప్ అయ్యాక తాను చేసే సినిమా మంచి హిట్ సినిమా కావాలని… పట్టుదలతో ఉండటంతో బాలయ్య కోసం ఎన్ని కథలు విన్నా తమను ఏది సంతృప్తి పరచలేకపోయిందని చెప్పారు. ఈ కారణంతోనే త‌మ కాంబినేష‌న్లో రెండో సినిమా పట్టాలెక్క‌లేదు అని వినాయక్ తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news