నందమూరి నటసింహం బాలకృష్ణకు అఖండతో తిరుగులేని ఊపు వచ్చిందన్న సంగతి తెలిసిందే. తనకు కలిసి వచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను తోనే అఖండ లాంటి తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బాలయ్య. వీరిద్దరి కాంబినేషన్లో సింహా , లెజెండ్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు రాగా అవన్ని బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం అందుకున్నాయి. ఈ లిస్ట్ లో కే అఖండ కూడా చేరింది . కరోన సమయంలో కూడా ఇండస్ట్రీకి కొత్త ఊపు తీసుకొచ్చింది అఖండ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
బాలాయ్య కెరియర్ లోనే ఏకంగా 150 కోట్ల గ్రాస్ వసులు సాధించిన సినిమాగా అఖండ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అఖండ తర్యాత బాలయ్య వరసుపెట్టి క్రేజి డైరెక్టర్ ల తో పవర్ ఫుల్ కాంబినేషన్లు సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం మలిలేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాను నటిస్తున్న నటసింహం బాలయ్య..ఆ తరువాత వెంటనే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపూడి తో కూడా ఓ సినిమాకు కమిటీ అయ్యాడు. ఈ రెండు సినిమాల తరువాత బాలయ్య మళ్లీ అఖండ లాంటి మంచి హిట్ ఇచ్చిన బోయపాటితో ఇంకో సినిమా చేయబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది.
ఇది ఇలా ఉంటే బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే దీని పై ఎన్నో వార్తలు వినిపించాయి.కానీ, ఇప్పటి వరకు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ పై బాలయ్య ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. మరోవైపు నందమూరి అభిమానులు మాత్రం బాలయ్య తనయుడు ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా కోసం టాలీవుడ్ లో చాలా మంది టాప్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి . ఫస్ట్ లో పూరి జగన్నాథ్ , క్రిష్ పేర్లు తెర మీదకు వచ్చాయి.
ఆ తరువాత అనిల్ రావిపూడి పేరు వినిపించింది. ఫైనల్ గా ఇప్పుడు తనకు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను చేతిలో కొడుకు ఎంట్రీని పెట్టాలని బాలయ్య డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే బాలయ్య బోయపాటి మధ్య రెండు మూడ్సా ర్లు కథా చర్చలు జరిగినట్టు తెలుస్తున్నాయి. ప్రజెంట్ యంగ్ హీరో రామ్ తో అదిరిపోయే మాస్ సినిమా తెరకెక్కిస్తున్న బోయపాటి.. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక..మోక్షజ్ఞ డెబ్యూ సినిమాని డైరెక్ట్ చేసే పనిలో బిజీ కానున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
క్లాస్ టచ్ తో పాటు నందమురి అభిమానులను మెప్పించే మాస్ అంశాల కలబోతలతో మోక్షజ్ఞ డేబ్యూ ఉంటుందని తెలుస్తుంది. ఏదైతేనేం.. అటు ఇటు తిరిగి బాలయ్య చివిరకు కొడుకు భవిష్యత్తును తన లక్కి డైరెక్టర్ బోయపాటి చేతిలో పెట్టాడు..ఇక బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే.. అంటూ అభిమానులు అంటున్నారు. వారాహి చలన చిత్రబ్యానర్ పై సాయి కొరపాటి ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారట బాలయ్య..!