బాలకృష్ణ బయట ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో సినిమా షూటింగ్ విషయంలో మాత్రం చాలా సీరియస్‌గా ఉంటారు. పక్కన ఉన్న వాళ్లు షూటింగ్ జరిగేతప్పుడు డిస్టర్బ్ చేస్తే పాత్ర సరిగా పండదని.. రీ టేకులు ఎక్కువైతే నిర్మాతకూ నష్టం జరుగుతుందన్నదే ఆయన భావన. బాలయ్య 106 సినిమాల్లో నటించారు. ఆయన ఏనాడు కూడా ఈ వయస్సులో ఇప్పటకీ ఒక్క రోజు కూడా షూటింగ్‌కు ఆలస్యంగా రారు.
ఉదయం 8 గంటలకు షాట్ ఉందంటే బాలయ్య 7 గంటలకే సెట్స్‌లో ఉంటారు. తన వల్ల దర్శక నిర్మాతలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు అన్నదే బాలయ్య సిద్ధాంతం. ఇక షూటింగ్‌లో ఎవ్వరూ ఇబ్బంది పెట్టకుండా కోపరేట్ చేయాలనే ఆయన కూడా అనుకుంటాడు. బాలయ్య నటించిన వీరభద్ర సినిమా 2006 సమ్మర్ కానుకగా ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ఏఎస్. రవికుమార్ చౌదరి దర్శకుడు.
బాలయ్యకు జోడీగా సదా, తనూ శ్రీ దత్తా హీరోయిన్లుగా నటించారు. పవర్ ఫుల్ యాక్షన్ సినిమాగా వీరభద్ర తెరకెక్కింది. మణిశర్మ సంగీతం అందించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, బాలయ్యకు సన్నిహితుడు అయిన మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో తనూశ్రీపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ సినిమా సాంగ్స్ న్యూజిలాండ్‌లో షూట్ చేశారు.
అక్కడ షూటింగ్‌లో ఓ రోజు షూటింగ్ పూర్తి చేసి అందరూ నిద్రపోయారట. మరుసటి రోజు షూటింగ్ 7 గంటలకే ఉండడంతో బాలయ్య ఉదయం 6 గంటలకే సెట్స్‌లోకి వెళ్లిపోయారట. అయితే తనూ శ్రీ మాత్రం తన లగేజ్ సర్దుకుని తన ఫాదర్‌కు బాలేదు.. తాను ఇండియా వెళ్లిపోతాని అని బయటకు వచ్చేసిందట. దర్శక నిర్మాతలకు తాను వెళ్లిపోతున్నాను అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారట.
తనూ శ్రీ ఇండియాకు వెళితే మళ్లీ ఎప్పుడు వస్తుందో ? తెలియదు. అప్పటి వరకు షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది.. నిర్మాతకు చాలా నష్టం. ఓ వైపు అంబికా కృష్ణ, దర్శకుడు రవికుమార్ తనూ శ్రీని బతిమిలాడుకోవడంతోనే సరిపోయిందట. చివరకు తనూ శ్రీ తండ్రికి వాళ్లే స్వయంగా ఫోన్ చేయించి.. ఆమెతో మాట్లాడించాక… ఆమె తండ్రి నాకు అంతా బాగా ఉందని చెప్పేవరకు ఆమె సెట్స్‌కు రాలేదట.
అప్పటి వరకు బాలయ్య షూటింగ్ స్పాట్‌లోనే ఉండడంతో పాటు అందరూ ఇబ్బంది పడడంతో తనూ శ్రీపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆమె ముందు రోజు వరకు షూటింగ్ చేసి… ముందుగా చెప్పకుండానే వెళ్లిపోవడం ఏంటని బాలయ్య ఫైర్ అయ్యారట. చివరకు మధ్యాహ్నం వరకు టైం వేస్ట్ అవ్వగా.. ఆ తర్వాత షూటింగ్ కొనసాగింది అట. తనూ శ్రీ బిహేవియర్ వల్లే ఆమె కెరీర్ ఆ తర్వాత సజావుగా కొనసాగలేదని కూడా నిర్మాత అంబికా కృష్ణ చెప్పారు.