ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో అందరూ షాక్ అయిపోయారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐశ్వర్య రజినీకాంత్ – ధనుష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ధనుష్ సినిమాలు చూసి ఐశ్వర్య అతడితో ప్రేమలో పడింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ధనుష్ సినిమా ప్రివ్యూ షో చూసేందుకు వచ్చిన ఐశ్వర్య అతడితో ప్రేమలో పడి.. ముందు తానే ప్రపోజ్ చేసింది. ఈ విషయాన్ని రజినీకాంత్ కు చెప్పగా ఆయన కూడా ఓకే అన్నారు.
ధనుష్ సైతం ఐశ్వర్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడంతో వీరిద్దరి వివాహాన్ని పెద్దలు జరిపించారు. ఇక 18 ఏళ్ల తర్వాత రీసెంట్ గా ఈ జంట విడిపోతూ అందరినీ షాక్ గురి చేసింది. అంతేకాకుండా ఐశ్వర్య రజనీకాంత్ ధనుష్ తో విడిపోవడానికి అతడికి హీరోయిన్లతో ఉన్న ఎఫైర్స్ కారణం అంటూ ఆరోపణలు వచ్చాయి. ధనుష్ కు తమిళ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయంటూ రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అలా ధనుష్ తో ఎఫైర్ ఉందంటూ వార్తల్లో నిలిచిన హీరోయిన్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం.
త్రిష :
ధనుష్ హీరోయిన్ త్రిషతో డేటింగ్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ క్లోజ్ గా దిగిన ఫోటోలు కూడా కొన్ని లీక్ అయ్యాయి. ఈ ఫోటోలో ధనుష్, త్రిషలు ముద్దు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. దాంతో వీరిద్దరి వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరు హాట్‌గా కలిసి ఉన్న ఫొటోలు చూస్తేనే వీరి మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్లినట్టుగా అనిపిస్తుంది.
శృతీహాసన్ :
కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ తోనూ ధనుష్ ప్రేమాయణం నడిపించినట్టు తమిళ మీడియా కోడై కూసింది. ధనుష్ – శృతిహాసన్ కలిసి కొలవరి 3 సినిమాలో నటించారు. ఈ సినిమాకు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా ఆ తర్వాత కొంతకాలం వీరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి.
అమలాపాల్ :
హీరోయిన్ అమలాపాల్ తోనూ ధనుష్ కు ఎఫైర్ ఉందంటూ అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా అమలాపాల్ దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ పెళ్ళైన కొంతకాలానికే విడాకులు తీసుకున్నారు. కాగా విజయ్ తండ్రి నిర్మాత అజగప్పన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. అమలాపాల్ విజయ్ విడిపోవడానికి ధనుష్ కారణమంటూ సంచలన ఆరోపణలు చేశాడు. దాంతో ధనుష్ పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి.
సారా ఆలీఖాన్ :
ధనుష్ బాలీవుడ్ లో అట్రాంగి రే అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ సైతం నటించింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి ఓ ఫంక్షన్ లో చాలా క్లోజ్ గా కనిపించారు. దాంతో ప్రస్తుతం ధనుష్ సారా అలీఖాన్ తో డేటింగ్లో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ధనుష్ తన భార్యతో విడిపోవడానికి కూడా కారణం సారా అలీ ఖాన్ కారణం అంటూ అంటూ టాక్ వినిపిస్తోంది.