గత రెండేళ్లుగా సౌత్ టు నార్త్ సినిమా ఇండస్ట్రీలో కఫుల్స్ మధ్య ఒక్కటే విడాకులు నడుస్తున్నాయి. అస్సలు ఎవ్వరూ ఊహించని జంటలు కూడా విడాకులు తీసేసుకుంటున్నారు. సమంత – చైతు, ధనుష్ – ఐశ్వర్య కూడా ఇలాగే విడాకులు తీసుకున్నారు. గత రెండేళ్లలో చాలా మంది సీనీ సెలబ్రిటీలు సింపుల్‌గా విడాకులు తీసేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులోనే మరో హీరోయిన్ కూడా జాయిన్ అయిపోయింది. అయితే ఈ సారి విడాకుల వెనక కొత్త ప్రేమ కారణంగా కనిపిస్తోంది.
మలైకా అరోరా స్నేహితురాలు, మాజీ హీరోయిన్ షమితా శెట్టి తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించింది. ఆమె సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టికి స్వయంగా సోదరి. షమితా శెట్టి టాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఇక్కడ కొన్ని సినిమాలు చేసినా అక్కకు వచ్చిన పేరు రాలేదు. ఇక ఇటీవలే ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లింది. అక్కడ రాకేష్ బాపట్ తో పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ డేటింగ్ మొదలు పెట్టారు.
అయితే ఆమెకు భర్తతో విబేధాలు రావడంతో రాకేష్ బాపట్ నుంచి విడిపోయారని వార్తలు రాగా… తాజాగా షమిత వీటిని కన్ఫార్మ్ చేశారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ అక్కౌంట్లో ఇకపై రాకేష్, తాను కలిసి లేమని చెప్పేసింది. తమకు మద్దతు ఇచ్చిన వారందరికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. రాకేష్‌ది పూణే. అతడిని ఇష్టపడినప్పుడు షమిత పూణే వెళ్లి రాకేష్ ఫ్యామిలీని కూడా కలిసి వచ్చేది. ఇంతలోనే వారు బ్రేకప్ చెప్పుకుని అందరికి షాక్ ఇచ్చారు.
ఇక తన బ్రేకప్‌పై షమిత స్పందిస్తూ బ్యాడ్‌లక్.. తాము పబ్లిక్ లైఫ్‌లో కొంత కాలం కలిసి ఉన్నాం.. అయితే దురదృష్టవశాత్తు తమ రిలేషన్ ముగిసిందని చెప్పింది. తాము కొంతమంది అభిమానుల ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నామని.. చాలా మంది మమ్మలను కలిసి చూసేందుకే ఇష్టపడతారు అని.. అయితే ఇప్పుడు తాము విడిపోవడం బాధకరం అని చెప్పింది.