అవును..తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నితి..ప్రజెంట్ ఎలాంటి పొజీషన్ లో ఉన్నాడో తెలిసిందే. ఒక్కో సినిమాకు 50 కోట్ల పారితోషం తీసుకుంటున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ప్రజెంట్ చేతిలో మూడు ప్రాజెక్ట్ లను పట్టుకుని “మాచర్ల నియోజకవర్గం” అనే సినిమాను రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు.
ఈ మధ్యనే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రా రా రెడ్డి ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అమంకు తెలిసిందే. ఈ దెబ్బతో నితిన్ ఖాతాలో మరో హిట్ పక్కా అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి క్రమంలో నితిన్ పై ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యారు. నితిన్ నన్ను మోసం చేశాడంటూ స్టేజీ పైనే ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అమ్మ రాజశేఖర్ డైరెక్షన్‌లో లెటేస్ట్ గా తెరకెక్కిన మూవీ ‘హై ఫైవ్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా సింపుల్ గా నిర్వహించారు మేకర్స్. నిజానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నితిన్ హాజరు కావాల్సిందట. కానీ, చివరి నిమిషంలో ఆయన హ్యాండ్ ఇచ్చిన్నట్లు అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. దీంతో ఆగ్రహానికి లోనైన అమ్మ రాజశేఖర్.. స్టేజీ పైనే అస్సలు విషయ్మ్ చెప్పేశి ఎమోషనల్ అయ్యారు. ” నితిన్‌ను ఈ ప్రోగ్రామ్‌కు రావాల్సిందిగా చాలా రోజుల ముందే ఆహ్వానించానని..ఆయన వస్తానని కూడా చెప్పారని
కానీ, ఇప్పుడు మాట మార్చేశారని చెప్పారు. నితిన్ మాట నమ్మి.. అన్నం కూడా తినకుండా కష్టపడి నితిన్ కోసం ఓ ప్రత్యేకమైన ఏవీ కూడా క్రియేట్ చేయించానని చెప్పి బాధపడ్డారు. నితిన్‌కు అసలు డ్యాన్సే రాదని.. ఆయనకు డ్యాన్స్ నేర్పించిందు కూడా ఆయనే అని చెప్పుతూ ఎమోషనల్ అయ్యారు.కాగా నితిన్ నటించిన ‘టక్కరి’ మూవీకి అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.