తమిళం – తెలుగు సినీపరిశ్రమల్లో అగ్ర నాయికగా ఎదిగిన అమలాపాల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చేసే పాత్రలతోనే ఆమె హైలెట్ అయ్యింది. ప్రభు సోలమన్ దర్శకత్వం వహించిన మైనా సినిమాతో తెరంగ్రేటం చేసిన ఆమె ఆ తర్వాత విజయ్, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో నటించింది. విక్రమ్, విజయ్ లాంటి హీరోల పక్కన ఆమెకు సూపర్ డూపర్ హిట్లు కూడా పడ్డాయి.
ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా చరణ్ పక్కన నాయక్ లాంటి సినిమాలు చేసి హిట్లు కొట్టింది. అయితే తమిళ దర్శకుడు ఏఎల్. విజయ్ ఆమెకు తన సినిమాల్లో వరుసగా ఛాన్సులు ఇచ్చారు. ఆ టైంలో చిగురించిన ప్రేమతోనే వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే విజయ్ కుటుంబ సభ్యులు అమలపై ఆంక్షలు పెట్టడంతో తట్టుకోలేకపోవడం.. మనస్పర్థల నేపథ్యంలో వీరు విడాకులు తీసుకున్నారు.
విచిత్రం ఏంటంటే 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2017కే విడాకులు తీసేసుకున్నారు. విడాకుల తర్వాత కూడా అమల ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంది. అయితే విడాకుల తర్వాత అమలాపాల్‌ను ఓ సెక్స్ రాకెట్ కంపెనీ టార్గెట్ చేసింది. ఆమెను తమవైపునకు లొంగదీసుకుని బడా బాబులకు ఎరవేయాలని ప్రయత్నించింది. అయితే ఈ విషయాన్ని చాకచక్యగా పసిగట్టిన అమల వాళ్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
2018లో అమల చెన్నైలో ఓ స్టూడియోలో డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నప్పుడు ఆ సెక్స్ రాకెట్ టీం ఆమెను సంప్రదించి తమ ప్లాన్ చెప్పింది. వెంటనే ఆమె టీ నగర్ మహిళా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె మలేషియాలో ఓ డ్యాన్స్ షోలో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆమె శ్రీధర్ మాజమాన్యంలోని డ్యాన్స్ స్టూడియోలో రిహార్సల్ చేస్తుండగా.. మలేషియా వెళ్లే క్రమంలోనే ఇబ్రహీంతో కలిసి డిన్నర్ చేయాలని అమలాపాల్‌ను కొందరు సంప్రదించారు.
ఆమెపై ఒత్తిళ్లతో వెంటనే అది సెక్స్ రాకెట్ అని గ్రహించిన అమల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై తాజాగా మాద్రాస్ హైకోర్టు స్పందించింది. అమలాపాల్ తన ఫిర్యాదులో బిజినెస్‌మెన్‌లు భాస్కరన్ , శ్రీథర్ ఇద్దరిపై ఆరోపణలు చేసింది. అయితే వీరిద్దరు తమకు ఈ కేసుతో సంబంధం లేదని కొట్టి వేయాలని కోరినా.. మద్రాస్ హైకోర్టు మాత్రం వీరి ఫిటిషన్‌ను కొట్టి వేసింది.