Moviesహాట్‌గా క‌నిపించ‌డంపై అల‌నాటి న‌టి ' సిల్క్‌స్మిత ' మైండ్ బ్లోయింగ్...

హాట్‌గా క‌నిపించ‌డంపై అల‌నాటి న‌టి ‘ సిల్క్‌స్మిత ‘ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్‌..!

మత్తు కళ్ళతో యావత్ తెలుగు ప్రపంచాన్ని తన అందచందాలతో ఆకట్టుకున్న నటిమణి సిల్క్ స్మిత. తన ఒంపు సొంపులతో కుర్రకాలు మతులు పోగొట్టింది. నాట్య విలాసాలు చేసి దశాబ్దానికి పైగా సినీ అభిమానుల గుండెల్లో గొప్ప స్థానం సంపాదించుకుంది. ఎన్నో లక్షల మంది అభిమానులను సంపాదించుకొని ఐటం గర్ల్ అనే పదానికి సరైన నిర్వచనం ఇచ్చిన సిల్క్, అందరినీ విషాదంలో ముంచుతూ పిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

తమిళ ఇండస్ట్రీ తో తొలిసారి నటిగా పరిచయమైంది సిల్క్ స్మిత. నిజానికి సిల్క్ అనే పాత్ర చేసి తాను నిజజీవితంలో సిల్క్ స్మితగా స్థిరపడిపోయింది. తమిళ సినిమా అయినా వండి చక్రం అనే సినిమాలో మొదటిసారిగా ఒక గ్లామరస్ రోల్ అయిన సిల్క్ అనే పాత్రలో అందరినీ మైమరిపించింది. అలా తొలిసారిగా నాట్య మయూరిగా ఇండస్ట్రీకి పరిచయమై తన నాట్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

పదవ తరగతి చదువుతున్న సమయంలోనే డాన్స్ మాస్టర్ పార్వతి దగ్గర తొలిత సిల్క్ స్మిత నాట్యం నేర్చుకునేది. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వస్తారు.సిల్క్ కూడా తను ఇండస్ట్రీలో కథానాయకగా ఒక వెలుగు వెలగాలని మద్రాస్ కు వచ్చింది. కానీ అవకాశాల వేటలో ఏ పాత్ర అయినా సరే పోషించడానికి సిద్ధం అయిపోయింది. నటిగా రాణించాలని తనకున్నప్పటికీ నాట్యతార గా రాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. డాన్సర్ కానివ్వండి, క్యాబరే ఆర్టిస్ట్ కానివ్వండి వ్యాంపైన, ఎలాంటి పాత్రైనా సరే చేయడానికి సిల్క్ స్మిత ఎప్పుడు సిద్ధంగా ఉండేది.

అలాగే భారతీరాజ దర్శకత్వంలో వచ్చిన సీతాకోకచిలుక సినిమాలో వదిన పాత్రలో తన చక్కటి నటనను ప్రదర్శించింది సిల్క్ స్మిత. ఆ తర్వాత కమల్ హాసన్ శ్రీదేవి నటించిన వసంత కోకిల సినిమాలోని ముసలి మొగుడుతో సంతోషం పొందలేక అవస్థలు పడే పాత్రలో అదరగొట్టేసింది. ఇలా పెర్ఫార్మన్స్ కి ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూనే శృంగార తారగా కూడా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. ఇలాంటి సిల్క్ కి పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం అసలు ఇష్టం ఉందా ? అసలు ఇలా వేసుకోవడం ఎంతవరకు సబబు? అనే ప్రశ్న ఒక ఇంటర్వ్యూలో ఎదురైందట.

దీనికి సమాధానం ఇస్తూ సిల్క్ ఈ విధంగా చెప్పింది. ” నేను స్పెషల్ సాంగ్స్ లో క్లబ్ సాంగ్స్ లో చిట్టి పొట్టి బట్టలు వేసుకుని నాట్యం చేస్తాం. నాకు చిన్నతనంలో గౌనులు వేసుకునే అలవాటు ఉండేది. అప్పటినుంచి నాకు చిన్న బట్టలు అంటేనే ఇష్టం ఆ తర్వాత మిని, మాక్సి డ్రెస్సులు వంటి మోడరన్ దుస్తులు ధరించడం నాకు అలవాటుగా మారింది. ఇలా పొట్టి బట్టలు వేసుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు పాత్రకు తగినట్టుగా బట్టలు వేసుకోవడం అనేది నా ఉద్దేశం. నాట్యంతోను అలాగే నటనతోను అభిమానులను అలరించాలనేదే నా ధ్యేయం”.ఇందులో ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు అని కుండ బద్దలు కొట్టినట్టు సిల్క్ సమాధానం ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news