సాధారణంగా మన తెలుగు సినిమాల్లో.. ఆ మాటకు వస్తే ఏ భాషా సినిమాల్లో అయినా హీరోకు నచ్చకుండా హీరోయిన్ను తీసుకోవడం జరగదు. పెద్ద హీరోలకు ఇష్టం లేకుండా హీరోయిన్ల ఎంపిక జరగనే జరగదు. అయితే స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో మీడియం రేంజ్, చిన్న హీరోలు యాక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం దర్శకుడు చెప్పిన దానికి తలవగ్గక తప్పదు.
అయితే ఈ వ్యవహారంలో ఏ హీరోయిన్ అయినా హీరోకు నచ్చితే ఆమెకు దక్కే గౌరవం, ప్రేమ వేరుగా ఉంటాయి. ఇక టాలీవుడ్లో టాప్ హీరోగా ఉన్న సదరు హీరోకు ఆకర్షణలు ఎక్కువే. హీరోయిన్లు నచ్చితే అమితంగా ప్రేమించేస్తారన్న టాక్ ఉంది. ఆయన పర్సనల్ లైఫ్‌పై రకరకాల గాసిప్‌లు ఉండనే ఉన్నాయి. రీసెంట్గా సదరు హీరో ఈ యేడాదే ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించారు. ఆ సినిమాలో నటించింది ఈ పక్క రాష్ట్రం అమ్మాయి.
అమ్మాయి ఒడ్డు పొడుగు బాగుంటుంది. అతడేమో ఫ్యామిలీకి ఇటీవలే ( కొద్ది నెలల క్రితం) దూరమైపోయాడు. దీంతో ఇప్పుడు సదరు హీరోగారికి.. ఆ హీరోయిన్‌తో కాలక్షేపం బాగా నడుస్తోందట. ఇదే విషయమై ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సదరు హీరోయిన్ కూడా ఈ హీరోకు పడిపోయిందంటున్నారు. తెలుగులో పెద్దగా అవకాశాలు లేనప్పటకీ ఇక్కడే మకాం వేసి ఈ హీరో ప్రాపకంలోనే రోజులు వెళ్లదీస్తోందట.
ఇప్పటికే ఫ్యామిలీకి దూరమైన సదరు హీరోగారు ఓ ఇద్దరు హీరోయిన్లను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాళ్లిద్దరు కాకుండా తన మల్టీస్టారర్‌లో తనతో నటించిన హీరోయిన్‌తో కాలక్షేపం కానించేస్తున్నాడు. ఇక విచిత్రం ఏంటంటే ఇదే హీరోయిన్‌పై ఒడ్డు, ఒంపు ఉండి చీరకట్టును బాగా ఇష్టపడే మరో డైరెక్టర్ కూడా ఈ హీరోయిన్నే అమితంగా ఇష్టపడుతున్నారని అంటున్నారు. అటు హీరో, అటు డైరెక్టర్ మధ్యలో ఆ హీరోయిన్ ఉన్నట్టు ఉన్నా ప్రస్తుతానికి ఆ హీరోగారితోనే కాలక్షేపం చేస్తోందంటున్నారు.