Moviesరిలీజ్‌కు ముందు నితిన్ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం కు పెద్ద దెబ్బ‌... భారీ...

రిలీజ్‌కు ముందు నితిన్ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం కు పెద్ద దెబ్బ‌… భారీ కుట్ర‌…!

టాలీవుడ్‌లో క‌న‌ప‌డ‌రు కాని.. చాలా మంది త‌మ‌కు న‌చ్చ‌ని సినిమాకు వ్య‌తిరేకంగా తెర‌వెనక చాలా కుట్ర‌లే చేస్తూ ఉంటారు. వాస్త‌వంగా చెప్పాలంటే బయట పబ్లిక్ లో కంటే సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా కుళ్ళు రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఒకరి సినిమా ప్లాప్ అయితే ఆనందపడేవాళ్లు చాలామంది ఉంటారు. ఇక్కడ వినిపించే మాటలు… కనపడే మెరుపులు అన్నీ కూడా పైపైన మాత్రమే ఉంటాయి. లోపల అంతా కుళ్ళు, కుట్రలే నడుస్తూ ఉంటాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా.. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ మాచర్ల నియోజకవర్గం.

ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కు రెడీగా ఉంది. నితిన్ కు ఈ సినిమా హిట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. నితిన్ నటించిన చెక్ సినిమా అంచనాలు అందుకోలేదు. ఈ క్రమంలోనే మాచర్ల నియోజకవర్గం పై నితిన్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్లు, టీజర్లు , పాటలతో ట్రేడ్ వర్గాల్లో… సినిమా వర్గాల్లో భారీ ఆసక్తిని క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాను ఎవరో కొందరు టార్గెట్ చేశారు.

సోషల్ మీడియాలో ఈ సినిమా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఫేక్ ప్రచారం చేయడంతో పాటు… మాచర్ల నియోజకవర్గాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎక్కడా లేని గందరగోళం నెలకొంది. ఈ వ్యాఖ్యలపై హీరో నితిన్ స్వయంగా స్పందించాడు. తమ డైరెక్టర్ రాజశేఖర్ పేరిట ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తప్పుడు కామెంట్లు పెడుతున్నారని… అలాంటి వార్తలను నమ్మవద్దని నితిన్ విజ్ఞప్తి చేశాడు.

అయితే ఈ సినిమా రిలీజ్ టైం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌గా… ఇలాంటి ప్రచారాలు జరగడం నిజంగా బాధాకరం. ఇక అదే రోజు మ‌రో యంగ్ హీరో నిఖిల్ న‌టిస్తోన్న కార్తీకేయ 2 కూడా రిలీజ్ అవుతోంది. నితిన్ తండ్రి సుధాక‌ర్‌రెడ్డి డిస్ట్రిబ్యూట‌ర్‌. ఆయ‌న్ను కూడా కొంద‌రు ఇటీవ‌ల ర‌క‌ర‌కాలుగా టార్గెట్ చేస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల గుస‌గుస‌..!

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news