సినీ స్టార్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసే జాతీయ చలన చిత్ర అవార్డుల విన్నింగ్ లిస్ట్ వచ్చేసింది. 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం కొద్ది సేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ అవార్డుల్లో ప్రతీసారీ.. తెలుగు సినిమాకి మొండి చేయి చూపించడం మామూలే. కాకపోతే..ఈ సారి జాతీయ అవార్డుల్లో మన తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా కలర్ ఫోటో .. అలాగే ఉత్తమ కొరియోగ్రఫీ చిత్రం ‘నాట్యం’, అంతేకాదు ఉత్తమ సంగీత చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు అవార్డులు దక్కించుకోవడం తెలుగు ఇందస్ట్రీకి గర్వ కారణం.
నిజానికి ఈ అవార్డుల ప్రకటన ఎప్పుడో చేయాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా 2021-22కిగానూ అవార్డుల ఎంపిక లేట్ అయ్యింది. కొద్దిసేపటి క్రితమే 2021-22కిగానూ సినిమాల విన్నింగ్ అవార్డుల లిస్ట్ ను రిలీజ్ చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వెల్లడించింది.ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్ (28 కేటగిరీలు), నాన్ ఫీచర్ ఫిల్మ్స్ (22 కేటగిరీలు), బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు.
ఈ ఏడాది మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్స్ ఎంట్రీకి వచ్చాయి. అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటరిగిలో 148 చిత్రాలు (20 భాషల్లో )స్క్రీనింగ్ వచ్చినట్లు జ్యూరీ మెంబర్స్ తెలిపారు. ఫీచర్ ఫిల్మ్స్ లో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ఫోటో నిలిచింది. అలాగే ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్‌ఎస్ థమన్ (అలా వైకుంఠపురములో) చిత్రానికి గానూ అవార్డుని అందుకున్నారు. అంతేకాదు..ఎటువంటి అంచనాలు లేకుండా..సైలెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటీవ్ హిట్ అందుకున్న నాట్యం సినిమా.. మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో పనిచేసిన టీవీ రాంబాబుకి అవార్డు దక్కడం మరో విశేషం అనే చెప్పాలి.. ఇక ముందుగా ఊహించినట్లుగానే సూర్య సూరరై పొట్రు(ఆకాశమే నీ హద్దురా) చిత్రానికి ఏకగా ఐదు అవార్డులు వచ్చి పడ్డాయి.
68వ జాతీయ అవార్డుల జాబితాః
* ఉత్తమ నటుడుః సూర్య(సూరారై పోట్రు), అజయ్ దేవగన్(తానాజీ)
* ఉత్తమ నటిః అపర్ణ బాలమురళి(సూరారై పోట్రు)
* ఉత్తమ సహాయ నటుడుః బీజూ మీనన్(అయ్యప్పనుమ్ కోషియుమ్)
* ఉత్తమ సహాయ నటిః లక్ష్మీ ప్రియా చంద్రమౌళి(శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్)
* ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): – తమన్ (అల వైకుంఠపురములో)
* ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : జీవీ ప్రకాశ్ కుమార్ (సూరరై పోట్రు -తమిళ్)
* బెస్ట్ స్టంట్స్ – అయ్యప్పనుమ్ కోషియమ్
* ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం -తెలుగు)
* ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: టీవీ రాంబాబు – నాట్యం
* ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనీయం ఎన్నుమ్ శిల పెంగల్లమ్ (తమిళ్)