సమంత 12 ఏళ్ల నుంచి టాలీవుడ్‌లో తిష్టవేసి పాతుకుపోయింది.స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతూ వస్తోన్న సమంత ఎప్పుడు ఏం చేసినా ఓ సంచలనమే అవుతోంది. రీల్ లైఫ్‌కు ఆమె శాసించినా.. రియల్ లైఫ్ జీవితాన్ని సెట్ చేసుకునే క్రమంలో మాత్రం ఆమె ఫెయిల్ అయ్యింది. అక్కినేని హీరో నాగచైతన్యతో ఆమె ప్రేమ పెళ్లి నాలుగేళ్లకే పెటాకులు అయిపోయింది. ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నాక చైతు – సమంత 2017లో గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే 2021లో నాలుగేళ్లకే వీరు విడిపోయారు.
విడాకుల తర్వాత కూడా సమంత తన కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులో శాకుంతలం, యశోద లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పక్కన ఖుషీ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. విడాకులకు ముందు కూడా ఆమె పెట్టిన పోస్టులు నెటిజన్లలో చాలా సందేహాలకు తావు ఇచ్చి.. వారి మధ్య ఉన్న గ్యాప్‌ను బయట పెట్టాయి. చివరకు అదే నిజమై వారు విడిపోయారు.
తన హాట్ ఇమేజ్‌లతో రచ్చ చేసే విషయంలో కూడా సమంత ఏ మాత్రం వెనక్కు తగ్గదు. సోషల్ మీడియాలో సమంత ఎప్పుడూ చిట్‌చాట్ చేస్తూ విపరీతంగా తన అభిమానులను పెంచుకుంటోంది. ఇప్పటికే ఆమెకు 2 కోట్లకు పైగా ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఇన్‌స్టాలో ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేసినందుకే లక్షలు చార్జ్ చేస్తూ ఉంటుంది. కేవలం ఫాలోవర్స్ విషయంలో మాత్రమే కాదు.. రెవెన్యూలోనూ సమంత చాలా టాప్.
సమంత ఇటు సినిమాలు, అటు వెబ్ సీరిస్‌లతో పాటు సోషల్ మీడియాలో పలుబ్రాండ్స్ ప్రమోట్ చేయడం ద్వారా కూడా భారీగా వెనకేసుకుంటోంది. ఆమెకు నెలకు ఇన్ స్టా గ్రామ్ ద్వారానే ఏకంగా రు. 3 కోట్లకు పైనే ఆదాయం వస్తుందట. ఇన్‌స్టా ద్వారా అత్యధిక ఆదాయం అందుకుంటోన్న హీరోయిన్ల జాబితాలో సమంతే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
ఒక్క నెలకు కేవలం ఇన్‌స్టా ద్వారానే పలు యాడ్స్ ప్రమోట్ చేస్తూ రు. 3 కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇప్పుటకీ కూడా తన క్రేజ్ తగ్గకపోవడంతో సమంత ఒక్కో సినిమాకు రు. 3-4 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది.