తెలుగు గడ్డపై ఎందరో సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య ప్రతి ఒక్కరిని కలిచివేసింది. చాలా సింపుల్‌గా ఉండే ఆమె ఆత్మహత్యకు కారణం ఏంటన్నది కూడా ఎవ్వరికి అంతు పట్టడం లేదు. పోలీసులు ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఆరా తీస్తున్నారు. ఆమె ఆత్మహత్య తర్వాత ఆమె గదిలో దొరికిన సూసైడ్ నోట్ ఆమె స్వయంగా రాసిందేఅన్న నిర్దారణకు పోలీసులు వచ్చేశారు.
ఇక ఆమె మృతదేహం దగ్గర దొరికిన కార్బన్ మోనాక్సైడ్ ఆమెకు ఎక్కడ ? నుంచి వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె గత కొంతకాలంగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. ఇక బ్రౌజింగ్‌లో కూడా పోలీసులు పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. ఆమె చనిపోవడానికి ముందు గూగుల్లో నొప్పిలేని మరణం కోసం చాలా వెతికింది అట.
ఈ క్రమంలోనే కార్బన్ మోనాక్సైడ్ వినియోగంపై ఆమెకు ఆలోచన వచ్చిందట. తన మరణానికి ముందు తన జీవితం తాను అనుకున్నట్టుగా లేదని కూడా స్నేహితుల వద్ద డిప్రెషన్‌తో వాపోయేదట. తన మరణాన్ని పది రోజుల ముందే సిద్ధం చేసుకున్న ఆమె అందుకు తగినట్టుగా ప్రిపేర్ అయిపోయిందట. తన కుటుంబానికి ఇబ్బంది లేకుండా.. ఎలాంటి అనుమానం రాకుండానే ప్రీ ప్లాన్డ్‌గా ఆమె ఆత్మహత్యకు ప్రణాళిక రచించుకుంది.
ఇక ఆమె ఫోన్ ద్వారా కూడా పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ఆమె అనుమానాస్పద మృతి వెనక తీవ్రమైన ఒత్తిడి దాగిఉన్నట్టే ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఇది తాను కోరుకున్న జీవితం కాదని.. తాను తన తల్లిదండ్రులకు భారంగా మారలేనని కూడా అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఐఆర్ ఎస్ కృష్ణారావు కుమార్తె అయిన ప్రత్యూష ఇండియాలో టాప్ 30 డిజైనర్లలో ఒకరిగా వెలుగొందుతున్నారు.
అమెరికాలో ప్యాషన్ డిజైనింగ్ కోర్సు చదివిన ఆమె హైదరాబాద్‌లో కెరీర్ స్టార్ట్ చేశారు. చాలా తక్కువ టైంలోనే ఆమె టాలీవుడ్,బాలీవుడ్ సెలబ్రిటీలకు డిజైనర్‌గా మారారు. ఆమె కాజల్ – శ్రీయా -రవీనా టాండన్- పరిణీతి చోప్రా- హుమా ఖురేషి- కాజోల్- మాధురీ దీక్షిత్- జూహీ చావ్లా- గౌహర్ ఖాన్- నేహా ధూపియా లాంటి సెలబ్రిటీలకు ప్యాషన్ డిజైనర్‌గా పనిచేశారు.