కొన్ని సినిమాల్లో కొందరు నటించిన పాత్రలు ఆ సినిమాలకు వన్నె తెస్తాయి. ఆ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు, దశాబ్దాలు అవుతున్నా కూడా వాటిని ప్రేక్షకులు ఎప్పటకీ మర్చిపోలేరు. ఆ పాత్రల్లో ఆ నటులు అంతలా లీనమై జీవించేస్తారు. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామీ దేవి పాత్ర ఎన్ని సినిమాలు వచ్చినా ఎప్పటకీ ఓ స్పెషల్‌గానే మిగిలిపోతుంది.
అసలు ఆ పాత్రకు ముందుగా అతిలోక సుందరి శ్రీదేవిని అనుకున్నారు. కారణాలు ఏవైనా ఆ పాత్ర శ్రీదేవి రిజెక్ట్ చేయడం నిర్మాతలకే కాదు సినిమాకే ప్లస్ అయ్యింది. అసలు ఆ పాత్రలో రమ్యకృష్ణను మినహా మరెవ్వరిని ఊహించుకోలేనంతగా రమ్యకృష్ణ జీవించేసింది. అలాగే రెండున్నర దశాబ్దాల క్రిందట వచ్చిన నరసింహా సినిమాలోనూ రమ్యకృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉండే విలన్ పాత్రలో నటించి సూపర్‌స్టార్ రజనీకాంత్‌నే ఢీ కొట్టి మెప్పించింది.
అసలు రజనీతో ఢీ అంటే ఢీ అనేలా ఆమె నీలాంబరిగా అదరగొట్టేసింది. ఓ లేడీ విలనిజం ఇంత పవర్ ఫుల్‌గా ఉంటుందా అని సౌత్ సినీజనాలు అవాక్కైపోయారు. ఆ పాత్ర వల్లే ఆ సినిమాకు మహిళా ఫాలోయింగ్‌తో పాటు రిపీటెడ్ ఆడియెన్స్ రావడంతో సూపర్ హిట్ అయ్యింది. అసలు సౌత్ సినీ జనాలను యేడాది పాటు నరసింహా ఓ ఊపు ఊపేసింది. ఆ పాత్రను ఆమె కాకుండా మరొకరు చేసి ఉంటే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యేవారే కాదు.
వాస్తవానికి ఆ పాత్ర కోసం ముందుగా ఆమెను కాకుండా వేరే హీరోయిన్ల పేర్లు పరిశీలించారట దర్శకుడు కేఎస్. రవికుమార్. ముందు అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న నగ్మాను సంప్రదించగా.. ఆమెకు ఆ క్యారెక్టర్ నచ్చినా డేట్లు ఖాళీగా లేక అయిష్టంగానే వదులుకున్నారట. తర్వాత అప్పట్లో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న మీనాను అడిగారట. అయితే అప్పట్లో మీనా ఏ పాత్ర చేయాలన్నా ఆమె తల్లి నిర్ణయమే ఫైనల్.
ఈ పాత్ర మీనాకు పిచ్చపిచ్చగా నచ్చేసినా ఆమె తల్లికి నచ్చకపోవడంతో ఆమె వదులుకోవాల్సి వచ్చింది. చివరకు అప్పుడు రమ్యకృష్ణ డేట్లు ఖాళీగా ఉండడం.. ఆమెకు ఈ పాత్ర నచ్చడం.. చేసేయడం వెంటనే జరిగిపోయాయి. ఇక ఈ పాత్రలో లేడీ విలన్‌గా తన నట విశ్వరూపం చూపించిన ఆమె చరిత్రలో ఎప్పటకీ గుర్తుండి పోయే పాత్రలో జీవించేసింది.