Moviesఇండియాలో టాప్ రెమ్యున‌రేష‌న్ ర‌జ‌నీదే... ప్ర‌భాస్‌, స‌ల్మాన్ రికార్డ్ బ్రేక్‌...!

ఇండియాలో టాప్ రెమ్యున‌రేష‌న్ ర‌జ‌నీదే… ప్ర‌భాస్‌, స‌ల్మాన్ రికార్డ్ బ్రేక్‌…!

ఇండియ‌న్ సినిమా సెల్యూలాయిడ్‌పై సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు ఉన్న క్రేజ్ ఏంటో అంద‌రికి తెలిసిందే. ర‌జ‌నీ కెరీర్‌లో ఇప్ప‌టికే 169 సినిమాలు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే ర‌జ‌నీ 170వ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. త‌న‌తో క‌బాలీ, కాలా లాంటి సినిమాలు తెర‌కెక్కించిన పా. రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఇక ర‌జ‌నీ చివ‌రి సినిమా అన్నాత్తే కోలీవుడ్‌లో ఓ మోస్త‌రుగా ఆడినా తెలుగులో పెద్ద‌న్న‌గా వ‌చ్చి ఆక‌ట్టుకోలేదు. ద‌ర్శ‌కుడు శివ ప‌ర‌మ‌రొటీన్ క‌థ‌, క‌థనాల‌తో సినిమాను తీయ‌డంతో తెలుగు ప్రేక్ష‌కులు పెద్ద‌న్న‌ను ఇష్ట‌ప‌డ‌లేదు. ఇక క‌మ‌ల్‌హాస‌న్ విక్ర‌మ్ సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఎలా ? ఇచ్చాడో ఇప్పుడు ర‌జ‌నీ అభిమానులు సైతం ర‌జ‌నీ మార్క్ అదిరిపోయే మాస్ కం బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇక ర‌జ‌నీ నుంచి తాజాగా జైల‌ర్ సినిమా ఎనౌన్స్ అయ్యింది. ఈ సినిమా కోసం ర‌జ‌నీ తీసుకునే రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు నేష‌న‌ల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ర‌జ‌నీ ఏకంగా రు. 140 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలోనే హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఇదే అంటున్నారు.

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ అమాంతంగా పెరిగిపోయింది. రాధేశ్యామ్‌కు రు. 80 కోట్లు, స‌లార్‌కు రు. 100 కోట్లు తీసుకుంటోన్న ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ సినిమాకు రు. 120 కోట్లు చార్జ్ చేస్తున్నాడు. ఇక ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కూడా కాస్త అటూ ఇటూగా అదే రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని టాక్ ?

అయితే ఇప్పుడు వీళ్లంద‌రిని మించిపోయి మ‌రీ ర‌జ‌నీ ఏకంగా రు. 140 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అది ఈ వ‌య‌స్సులో…! జైల‌ర్ సినిమాతో ర‌జ‌నీ త‌న పూర్వ‌పు ఫామ్‌ను అందుకోవ‌డంతో పాటు త‌న ఫ్యాన్స్‌కు విక్ర‌మ్ రేంజ్ హిట్ ఇస్తాడేమో ? చూద్దాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news