లోక నాయకుడు కమల్ హాసన్ నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ రోజు విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమ్ సినిమాకు ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్, గెస్ట్ రోల్లో సూర్య తదితరులు నటించడంతో పాటు టీజర్లు, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ రోజు పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ :
చెన్నైలో భారీగా డ్రగ్స్‌తో ఉన్న ఓ కంటైనర్ మిస్ అవుతుంది. ఈ కంటైనర్ సంతానం ( విజయ్ సేతుపతి)కి చెందింది. దీని కోసం విజయ్ వెతుకుతూ ఉంటాడు. మరోవైపు ఓ గ్యాంగ్ ముసుగులు వేసుకుని ఆఫీసర్లను చంపుతూ ఉంటుంది. ఈ కేసు చేధించడానికి అమర్ ( ఫాహాద్ ఫాజిల్) రంగంలోకి దిగుతాడు. మరి కర్ణన్ ( కమల్‌హాసన్) ఎవరు ? అసలు విక్రమ్ ఎవరు ? అతడి బ్యాక్ స్టోరీ ఏంటి ? ఈ గ్యాంగ్‌కు విక్రమ్‌కు ఉన్న కనెక్షన్ ఏంటన్నదే ఈ సినిమా స్టోరీ ?
విశ్లేషణ :
కమల్ హాసన్ రెండు డిఫరెంట్ వేరియేషన్లలో నటించి మెప్పించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో పాటు కొన్ని యాక్షన్ సీన్లు, ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్‌లలో అద్భుతమైన నటనతో పాటు డైలాగ్ డెలివరీతో చాలా బాగా నటించాడు. విజయ్ సేతుపతి తన నటనతో పాటు లుక్స్‌తో సినిమాకు హైలెట్‌గా నిలిచాడు. ఫహాద్ ఫాజిల్ లుక్స్ యాక్టింగ్ పరంగా గత సినిమాల కంటే భిన్నంగా కనిపించాడు. ఎమోషనల్ సీన్లలో సెటిల్డ్‌గా నటించాడు. సినిమా ఎండింగ్‌లో కనిపించిన సూర్య వైల్డ్‌గా కనిపించి ఆకట్టుకన్నాడు.
మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలలో ఒదిగిపోయారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాసుకున్న డ్రగ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ సీన్లు బాగున్నాయి. విక్రమ్ పాత్రతో పాటు ఆ పాత్ర తాలూకూ ప్లాష్ బ్యాక్‌ను డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. అయితే దర్శకుడిగా అద్భుతంగా ఆలోచించిన కనకరాజ్.. రచయితగా మాత్రం అనుకున్నంతగా మెప్పించలేదు.
ఈ కరెక్షన్ కూడా సరి చేసుకుని ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది. సినిమా కథనం లోకేష్ కనకరాజ్ గత సినిమాల్లాగానే స్లోగా ముందుకు కదులుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫస్టాఫ్‌ను చాలా స్పీడ్‌గా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో మాత్రం సాగదీసినట్టుగా ఉంది. క్లైమాక్స్‌ను మాత్రం అద్భుతంగా ముగించాడు.
ఇక కథను మలుపుతిప్పే సూర్య, కమల్ పాత్రలను మరింత బలంగా ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా ఆసక్తికరమైన పాత్రలతో సినిమాను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా కథనం మీద మరింతగా కసరత్తులు చేయాల్సి ఉందనిపించింది. అనిరుధ్ సంగీతంలో నేపథ్య సంగీతం సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టింది. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉండేలా ఉంది. ఎడిటింగ్ సెకండాఫ్‌లో కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా…
విక్రమ్ అంటూ భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమాలో నలుగురు కీలక నటులు ఉండడం ప్లస్. సరే సినిమాలో కథనం కాస్త వీక్‌గా ఉన్నా స్టైలీష్ యాక్షన్ డ్రామాలు ఇష్టపడే వారు బాగా ఎంజాయ్ చేసే సినిమా.. అందులో డౌట్ లేదు.
ఫైనల్ పంచ్ : విక్రమ్ స్టైలీష్ యాక్షన్ డ్రామా
విక్రమ్ రేటింగ్ : 2.5 / 5