Movies20 ఏళ్ల వ‌య‌స్సులో ఎన్టీఆర్‌కు మాత్ర‌మే చేసిన వండ‌ర్ ఇది... ఎవ్వ‌డూ...

20 ఏళ్ల వ‌య‌స్సులో ఎన్టీఆర్‌కు మాత్ర‌మే చేసిన వండ‌ర్ ఇది… ఎవ్వ‌డూ కొట్ట‌లేడు కూడా…!

ఈ త‌రం స్టార్ హీరోల‌లో త‌క్కువ వ‌య‌స్సులోనే ఎవ్వ‌రికి సాధ్యం కాని రికార్డులు ఎన్నో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ పేరిట ఉన్నాయి. ఎన్టీఆర్‌కు కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఖండాంత‌రాల్లోనూ ల‌క్ష‌ల్లోనే అభిమానులు ఉంటారు. కేవ‌లం 20 ఏళ్ల‌కే ఎన్టీఆర్‌కు మ‌హామ‌హా స్టార్ హీరోల‌కే రాని స్టార్‌డ‌మ్ వ‌చ్చేసింది. నూనుగు మీసాల వ‌య‌స్సులోనే స్టూడెంట్ నెంబ‌ర్ 1, ఆది, సింహాద్రి సినిమాలు ఎన్టీఆర్‌ను తీసుకుపోయి టాలీవుడ్ సింహాస‌నం మీద కూర్చోపెట్టేసి తిరుగులేని స్టార్‌ను చేసి ప‌డేశాయి.

ఇక ఎన్టీఆర్‌కు కూడా అభిమానులు అంటే ఎంతో ఇష్టం. త‌న అభిమానుల‌కు ఎన్టీఆర్ ఎంతో ప్ర‌యార్టీ ఇస్తూ ఉంటాడు. ఇక ఎన్టీఆర్ కెరీర్‌లో డిజాస్ట‌ర్ సినిమాల‌లో ఆంధ్రావాలా కూడా ఒక‌టి. సింహాద్రి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో ఈ సినిమా వ‌చ్చింది. సింహాద్రి క‌రెక్టుగా 175 రోజులు అయిన మ‌రుస‌టి రోజునే 2004 జ‌న‌వ‌రి 1 కానుక‌గా ఆంధ్రావాలా వ‌చ్చింది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌క్షిత హీరోయిన్‌గా వ‌చ్చిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

ఎన్టీఆర్‌ను సింహాద్రి రేంజ్‌లో అభిమానులు ఊహించుకున్నారు. అయితే ఇక్క‌డ క‌థ‌, క‌థ‌నాలు సింహాద్రి అంచుల‌ను కూడా ట‌చ్ చేయ‌లేదు. దీంతో ఆంధ్రావాలా ఫ‌లితం అభిమానుల‌ను నిరాశ ప‌రిచింది. అయితే ఈ సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎప్ప‌ట‌కీ ఏ హీరో ట‌చ్ చేయ‌ని ఓ అరుదైన రికార్డ్ త‌న పేరిట లిఖించుకున్నాడు. ఈ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు ఏకంగా 10 ల‌క్ష‌ల మంది అభిమానులు వ‌చ్చారు.

సీనియ‌ర్ ఎన్టీఆర్ స్వ‌గ్రామం అయిన కృష్ణా జిల్లా పామ‌ర్రు మండ‌లం నిమ్మ‌కూరులో ఆంధ్రావాలా ఆడియో ఫంక్ష‌న్ నిర్వ‌హించారు. 2003 చివ‌ర్లో ఈ ఆడియో ఫంక్ష‌న్ జ‌రిగింది. 2004 ఎన్నిక‌ల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటోన్న మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వ‌ర్యంలో ఈ ఆడియో ఫంక్ష‌న్ జ‌రిగింది.

20 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఓ హీరో న‌టించిన సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు ఈ రేంజ్‌లో జ‌నాలు రావ‌డంతో అంద‌రూ షాక్ అయిపోయారు. నిమ్మ‌కూరు పోటెత్తింది. ఏకంగా ఆ ప‌ల్లెటూర్ల‌లో 15 కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. విజ‌య‌వాడ‌, గుడివాడ‌, బంద‌రు లాంటి ప‌ట్ట‌ణాలు ఎన్టీఆర్ అభిమానుల‌తో కిక్కిరిసి పోయాయి. అస‌లు తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎంత పెద్ద స్టార్ హీరోకు లేని విధంగా ఓ ఆడియో ఫంక్ష‌న్‌కు 10 ల‌క్షల మంది అభిమానులు రావ‌డం అదే తొలిసారి..!

చివ‌ర‌కు చాలా మంది స్టేజ్ వ‌ర‌కు కూడా వెళ్ల‌కుండా మ‌ధ్యలోనే ఉండిపోయారు. ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు కూడా ఈ జ‌నాలు.. ఎన్టీఆర్ క్రేజ్ చూసి షాక్ అయ్యాయి. ఎన్టీఆర్ తాను కూడా ఆ ఫంక్ష‌న్‌కు అన్ని ల‌క్ష‌ల మంది వ‌స్తార‌ని ఊహించ‌లేదంటూ అభిమానుల అభిమానానికి ఉప్పొంగిపోయాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news