ప్రస్తుతం ఇండస్ట్రి కళ్లు అన్నీ కూడా నాని సినిమా “అంటే సుందరానికి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై పడ్డాయి. నిజానికి ఈ సినిమాకోసం ఎదురు చూసేవారు ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ..ప్రి రిలీజ్ ఫంక్షన్ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. దానికి మెయిన్ రీజన్..పవర్ స్టార్ పవన్ కల్యాణ్. యస్.. ఈ పవర్ ఫుల్ హీరో స్పీచ్ కోసమే..జనాలు ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలల వరకు పవన్ సినిమా స్పీచ్ అంటే ..కధ, డైరెక్టర్లు , టెక్నీషీయన్స్, ఇతర పాత్రల గురించి పొగడటం..ఇలానే ఉండేటివి.
సినిమా ఫంక్షన్ లో ..రాజకీయాలను తీసుకోచ్చేవాదు కాడు . కానీ, టికెట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా..పవన్ రైజ్ అయ్యిపోయి..సాయి ధరమ్ తేజ్ “రిపబ్లిక్” సినిమాలో రెచ్చిపోయి మాట్లాడారు. ఒక్క ముక్క లో చెప్పాలంటే అడిగి కడిగి పారేశారు. ఆ తరువాత జరిగిన తతంగం అంతా మనకు తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీ రెండు గా డివైడ్ అయ్యిపోయింది. పవన్ యాంటీ బ్యాచ్..పవన్ సపోర్ట్ బ్యాచ్. హీరో నాని..పవన్ సపోర్ట్ బ్యాచ్ లోకే వస్తారు.
ఎందుకంటే పవన్ టికెట్స్ విషయంలో గొంతు చించుకుని అరుస్తున్నా..ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు..ఆ టైంలో నాని తెగించి ముందడుగు వేసి మాట్లాడాడు. దానికి కూడా ఏపీ ప్రభుత్వం ..నానికి బాగా కౌంటర్లు వేసింది. ఆ ఇష్యూ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. పవన్ కల్యాణ్ నాని సినిమాకి రావడం వెనుక ఇది ఒక్క బలమైన రీజన్ అయితే..రెండోది మైత్రి మూవీ మేకర్స్.
వీళ్ల తోనే పవన్ “భవధీయుడు భగత్ సింగ్ “సినిమా తియ్యబోతున్నాడు. సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అవుతుంది..కానీ మ్యాటర్ ముందుకు కదలటం లేదు. దీంతో వాళ్లు కాల్ చేసి అడిగేసరికి..నాని సినిమాకు వస్తున్నాడు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. నాని “అంటే సుందరానికి ” సినిమాను మైత్రి బ్యానర్లోనే రాబోతుంది. మరి చూడాలి..నేడు జరగబోతున్న ఈవెంట్ లో పవన్ ఏం మాట్లాడుతారో..?