టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాడు. అసలు ఈ తరం జనరేషన్ హీరోల్లో ఏ హీరోకు లేనంత గొప్ప రికార్డ్ ఎన్టీఆర్ ఖాతాలో పడింది. అసలు ఎన్టీఆర్‌కు గత ఆరేడేళ్లుగా పట్టిందల్లా బంగారం అవుతోంది. ఎన్టీఆర్ కెరీర్‌లో చివరిసారిగా 2014 దసరాకు వచ్చిన రభస మాత్రమే ప్లాప్ సినిమా. అప్పటి నుంచి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.
2015 లో టెంపర్, 2016లో నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, 2017లో జై లవకుశ, 2018లో అరవింద సమేత వీరరాఘవ తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని.. తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఆరు సినిమాలు హిట్ అవ్వడంతో పాటు ఎన్టీఆర్ కెరీర్‌లో ఫస్ట్ టైం డబుల్ హ్యాట్రిక్ హిట్ నమోదు అయ్యేలా చేశాయి. ఈ తరం జనరేషన్ హీరోల్లో ఏ హీరోకు ఈ గొప్ప రికార్డ్ లేదు.
వరుసగా ఆరు హిట్లు అంటే మామూలు విషయం కాదు. ఇక త్రిబుల్ ఆర్‌తో పాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్‌కు క్రేజ్ వచ్చింది. ఈ సినిమా రు. 1150 కోట్ల గ్రాస్ వసూళ్లు వరల్డ్ వైడ్‌గా కొల్లగొట్టేసింది. ఇదిలా ఉంటే ఇప్పటి తరం యంగ్ స్టర్స్‌లో ఏ హీరోకు లేనట్టుగా మరో అరుదైన రికార్డ్ కూడా ఎన్టీఆర్ ఖాతాలో ఉంది. ఎన్టీఆర్ నటించిన నాలుగు సినిమాలకు వరుసగా ఉత్తమ కథానాయకుడు అవార్డు రావడం.
2007లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగకు సిని మా అవార్డుల్లోనూ, ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ తారక్‌కు ఉత్తమ కథనాయకుడు అవార్డు వచ్చింది. 2008లో వచ్చిన కంత్రి సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ కథనాయకుడుగా ఎంపికయ్యాడు. ఇక 2009 కేలండర్ ఈయర్‌లో ఎన్టీఆర్ ఖాళీగా ఉన్నాడు. 2010లో వివి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ సినిమాలో రెండు పాత్రల్లో అదర గొట్టేశాడు. అసలు చారి పాత్ర ఎంతలా హైలెట్ అయ్యిందో తెలిసిందే.
ఈ అదుర్స్ సినిమాకు కూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ కథనాయకుడిగా ఎంపికయ్యాడు. ఇక 2010లో వచ్చిన బృందావనం సినిమాకు కూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ కథనాయకుడి అవార్డు వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించిన నాలుగు వరుస సినిమాలకు ఉత్తమ కథానాయకుడిగా అవార్డులు రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ అరుదైన రికార్డ్ కూడా ఎన్టీఆర్ ఖాతాలోనే పడింది.