టాలీవుడ్‌లో ప్లాప్ అన్న పదం ఎరుగని కొద్ది మంది దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. రాజమౌళి సరసన ఈ లిస్టులో కొరటాల శివ కూడా ఉండేవారు. అయితే ఆచార్య సినిమా కొరటాలను పాతాళంలో పడేసింది. చాలా ఘోరమైన డిజాస్టర్ అవ్వడంతో కొరటాల కెరీర్‌లో పెద్ద మాయని మచ్చగా మిగిలింది. ఇక ఎఫ్ 3 సినిమాకు ముందు వరకు అనిల్ రావిపూడి సైతం ఐదు వరుస హిట్లతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఎఫ్ 3 సినిమా ప్రి రిలీజ్‌కు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
భారీ ఎత్తున ప్రమోషన్లు కూడా చేశారు. కట్‌చేస్తే సినిమాకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం తుస్సుమనిపించింది. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి 17 రోజులు పూర్తయ్యింది. 16వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రు. 16 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో రు. 70 కోట్ల గ్రాస్, రు. 43. 26 కోట్ల షేర్ రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్‌గా రు. 90 కోట్ల గ్రాస్… రు. 53. 29 కోట్ల షేర్ రాబట్టింది.
ఈ సినిమాకు మొత్తం రు. 63. 30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే మరో రు. 11 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే ఎఫ్ 3 సినిమా పూర్తిగా డౌన్ అయిపోయింది. మరోవైపు థియేటర్లలో మేజర్ – విక్రమ్ – తాజాగా నాని అంటే సుందరానికి సినిమాల హవా బాగా నడుస్తోంది. విక్రమ్, మేజర్ రెండో వారంలోనూ స్ట్రాంగ్‌గానే నిలబడ్డాయి. అసలు ఎఫ్ 3 సినిమాకు ఎంత టిక్కెట్ రేట్లు తగ్గించినా ఫ్యామిలీ ఆడియెన్సే ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఎఫ్ 2 సినిమాకి మించి ఈ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే కామెడీ, రొమాంటిక్ పాళ్లు పెరిగిపోయాయి. ఆర్టిస్టుల సంఖ్య బాగా పెరిగింది.. రెమ్యునరేషన్లు పెరిగాయి. బడ్జెట్ పెరగడంతో ఎక్కువ రేట్లకు అమ్మారు. అయితే ఎఫ్ 2 సినిమాలో ఉన్న మ్యాజిక్ ఇందులో మిస్ అయ్యింది. ఎఫ్ 2లో ఉన్న మేజరిజమ్స్, మనస్సును టచ్ చేసే కామెడీ ఇందులో మిస్ అయ్యింది.
కొన్ని సీన్లలో ఎఫ్ 2 సినిమానే రిపీట్ చేశారా ? అన్నంత ఫీలింగ్ కలిగింది. దీంతో సినిమా లాంగ్ రన్‌లో నిలబడలేకపోయింది. ఇక ఈ సినిమా వచ్చిన రెండో వారంలో వచ్చిన మేజర్, విక్రమ్ ఫస్ట్ డే నుంచే సూపర్ టాక్‌తో దూసుకు పోవడంతో ఎఫ్ 3 రెండో వీకెండ్‌లోనే తేలిపోయింది. దీంతో రు. 11 కోట్ల నష్టాలతో అనిల్ రావిపూడి కెరీర్‌లో ఫస్ట్ ప్లాప్ సినిమాగా ఎఫ్ 3 మిగిలిపోనుంది. ఇకపై అయినా అనిల్ మరీ రొట్ట కామెడీ కాకుండా.. కాస్త తన జానర్‌కు యాక్షన్, ఇతర ఎలిమెంట్స్ జోడించాల్సి ఉంటుంది.