యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరు వరుస హిట్ సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌కు స్టార్టింగ్‌లోనే బలమైన పునాది వేసి మాస్‌లో తిరుగులేని ఇమేజ్ తీసుకువచ్చిన దర్శకుల్లో ఇద్దరే ప్రధానంగా ఉంటారు. వారిలో ఒకరు రాజమౌళి, రెండో వ్యక్తి వివి. వినాయక్. వీళ్లిద్దరు పోటాపోటీగా ఎన్టీఆర్‌తో సినిమాలు తీసి హిట్లు కొట్టారు. ముందు రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1తో హిట్ ఇస్తే వెంటనే వినాయక్ ఆది చేసి బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు. ఆ వెంటనే రాజమౌళి ఆదిని మించిన బ్లాక్‌బస్టర్ సింహాద్రితో ఇచ్చాడు.
సింహాద్రి తర్వాత వినాయక్ మళ్లీ సాంబ చేసి హిట్ ఇచ్చాడు. తర్వాత రాజమౌళి యమదొంగ చేశాడు. మళ్లీ వినాయక్ అదుర్స్ ఇలా ఇద్దరూ కూడా పోటాపోటీగా ఎన్టీఆర్‌తో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ భయంకరంగా పెరిగిపోయింది. ఆ టైంలో ఎవరితో సినిమాలు చేయాలా ? అని ఆలోచిస్తోన్న టైంలో అప్పటికే రవితేజతో వరుస హిట్లు తీసి ఫామ్‌లో ఉన్న పూరి జగన్నాథ్ ఆంధ్రావాలా చేశాడు. 2004 జనవరి 1న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయ్యింది.
అయితే అదిరిపోయే ఓపెనింగ్స్ రావడంతో వసూళ్లు భారీగానే వచ్చాయి. ఆంధ్రావాలా ప్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ మళ్లీ వినాయక్‌తో తన రెండో సినిమాకు కమిట్ అయ్యాడు. ఆది తర్వాత ఎన్టీఆర్ – వినయ్ కాంబోలో సాంబ వచ్చింది. తనకు సన్నిహితుడు అయిన కొడాలి నాని అప్పటికి గుడివాడ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన స్వయంగా సాంబ సినిమా నిర్మించారు. భూమికా చావ్లా, జెనిలీయా హీరోయిన్లుగా చేశారు. 2004 జూన్ 9న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
విద్య యొక్క గొప్పదనం చాటి చెప్పేలా ఈ సినిమా కథ నడుస్తుంది. సినిమాకు మణిశర్మ అందించిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే సింహాద్రి, ఆది రేంజ్‌లో ఈ సినిమాను అభిమానులు ఊహించుకోవడంతో ఆ స్థాయి అంచనాలు అందుకోలేదు. ఓవరాల్‌గా అయితే సాంబ బాక్సాఫీస్ దగ్గర యబో యావరేజ్ మార్కులు వేయించుకుంది.
ఇక ఈ సినిమా కన్నడలో మాండ్య పేరుతో రీమేక్ అయ్యింది. విచిత్రం ఏంటంటే మన దేశ ఎల్లలు దాటేసి బంగ్లాదేశ్‌లో బెంగాలీ భాషలో కూడా ఏక్ రోఖా పేరుతో రీమేక్ అయ్యి సంచలన విజయం సాధించింది. ఇటు హిందీలోనూ ఈ సినిమాను ఇదే పేరుతో అనువదించారు. అలా సాంబ సినిమా తెలుగులో యావరేజ్ అయినా బయట ఎక్కువ విజయం సాధించింది.