టాలీవుడ్ నటరత్న నందమూరి తారకరామారావు తన కెరీర్‌లో 300కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ కెరీర్‌లో పౌరాణిక, జానపద, సాంఘీక, చారిత్రక సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో ఆ రోజుల్లోనే ఆయనకు సినిమాకు 30 రోజుల కాల్షీట్లు ఇచ్చినందుకు గాను రు. 5-6 లక్షల రెమ్యునరేషన్ ఉండేది. అప్పట్లో అది చాలా టాప్ రెమ్యునరేషన్. ఆ తర్వాత అడవి రాముడు సినిమాకు ఆయన రెమ్యునరేషన్ రు. 35 లక్షలు.
ఆ రెమ్యునరేషన్ చూసి టాలీవుడ్ జనాలు షాక్ అయిపోయారు. వామ్మో సినిమాకు అంత రెమ్యునరేషనా ? అని నోరెళ్లబెట్టేవారు. ఎన్టీఆర్ కమర్షియల్ స్టార్‌డమ్ ఓ రేంజ్‌కు తీసుకువెళ్లిన సినిమా ఖచ్చితంగా అడవిరాముడు సినిమాయే. ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కొంచెం కొంచెం పెరిగింది. అయితే ఒక్కసారిగా భారీగా ఆయన రెమ్యునరేషన్ హైక్ అయ్యింది మాత్రం అడవి రాముడు సినిమాకే.
ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యారు. 1994 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ శ్రీనాథ కవిసౌర్వభౌమ, సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్ సినిమాలు చేశారు. అయితే ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ రెమ్యునరేషన్ తీసుకున్న సినిమాగా మేజర్ చంద్రకాంత్ రికార్డులకు ఎక్కింది. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఎన్టీఆర్‌కు జనాల్లో ఉన్న ఇమేజ్ దృష్ట్యా హీరోయిజంతో పాటు కమర్షియాలిటీ ఉన్న కథతో సినిమా చేయాలని కె. రాఘవేంద్రరావుకు దగ్గరకు వెళ్లి చెప్పారు.
అప్పుడు కె. రాఘవేంద్రరావు మేజర్ చంద్రకాంత్ కథను ఎన్టీఆర్‌కు చెప్పగా వెంటనే ఒప్పుకున్నారు. అప్పుడు ఈ సినిమాను తన బ్యానర్లో నిర్మించేందుకు మోహన్‌బాబు ముందుకు వచ్చారు. అలా ఆ సినిమా సెట్ అయ్యింది. ఈ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో బీ, సీ సెంటర్లలో ఒకే కేంద్రంలో రెండు, మూడు థియేటర్లు ఉంటే వారం రోజుల పాటు ఇదే సినిమా ఆడించగా.. అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.
ఆ సినిమాకు ఎన్టీఆర్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలన్న చర్చ వచ్చినప్పుడు… అప్పటికే చిరంజీవి లాంటి హీరోలు స్టార్ స్టేటస్‌లో ఉండి… ఒక్కో సినిమాకు రు. 65 లక్షల వరకు తీసుకుంటున్నారు. అంతకంటే ఎక్కువుగా రు. కోటి రెమ్యునరేషన్ మోహన్‌బాబు ఎన్టీఆర్‌కు ఇచ్చారు. అలా తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా రు. కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా ఎన్టీఆర్ రికార్డులకు ఎక్కారు. ఆ తర్వాత కోటి రెమ్యునరేషన్ తీసుకున్న రెండో హీరోగా చిరంజీవి నిలిచారు.