టాలీవుడ్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగు దశాబ్దాల క్రితం తన తండ్రితో కలిసి నటించిన తాతమ్మకల సినిమాతో తొలిసారిగా వెండితెరపై కనిపించారు బాలయ్య. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ఎనర్జీతో బాలయ్య వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. బాలయ్య తన కెరీర్లో ఇప్పటికే 106 సినిమాల్లో నటించాడు బాలయ్య. మరో నాలుగైదు సినిమాలను ఇప్పటికే లైన్లో పెట్టారు.
ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య తన 107వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించనున్నాడు. తన కెరీర్ లో బాలయ్య ఎంతో మంది దర్శకులతో కలిసి పని చేశాడు. అలాగే మరెంతో మంది హీరోయిన్లతో నటించాడు. బాలయ్య ఎందరు దర్శకులతో కలిసి పనిచేసినా ఆయన కెరీర్లో ముగ్గురు దర్శకులు మాత్రం ఎప్పటికీ స్పెషల్ అని చెప్పాలి.
బాలయ్య కెరీర్ స్టార్టింగ్ లో ఓ సీనియర్ దర్శకుడు సూపర్ డూపర్ హిట్లతో బాలయ్యను నిలబెడితే…. బాలయ్య కెరీర్ మిడిల్‌లో ఉండగా మరో దర్శకుడు తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్లతో బాలయ్యను శిఖరాగ్రం లో నిలిపాడు. ఇక బాలయ్య కెరీర్ ఐదు పదుల వయసు దాటాక మరో డైరెక్టర్ సూపర్ డూపర్ హిట్ లు ఇస్తూ బాలయ్య మాస్ ఎనర్జీ ఇప్పటికీ అలాగే కంటిన్యూ అయ్యేలా చేశాడు. ఈ ముగ్గురు దర్శకులు బాలయ్యకు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చారు.
బాలయ్య హీరోగా 1984లో మంగమ్మగారి మనవడు సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఇది బాలయ్యకు కమర్షియల్‌గా ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో మరోసారి బాలయ్య నటించిన ముద్దుల కృష్ణయ్య సినిమా వచ్చి బంపర్ హిట్ అయ్యింది. ఆ మరుసటి ఏడాదే 1987లో మువ్వగోపాలుడు సినిమా కూడా వీరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కోడి రామకృష్ణతో వరుసగా చేసిన మూడు సినిమాలు హిట్ అవ్వడంతో వీరిది తొలి హ్యాట్రిక్ కాంబినేషన్ గా రికార్డులకు ఎక్కింది.
ఆ తర్వాత బాలయ్య కెరీర్ మధ్యలో ఉన్నప్పుడు బి.గోపాల్ వరుసగా నాలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు. అందులో రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి. లారీ డ్రైవర్ – రౌడీ ఇన్స్పెక్టర్ – సమరసింహారెడ్డి – నరసింహనాయుడు ఈ నాలుగు సినిమాలు వీరి కాంబినేషన్ లో వరుసగా వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాలలో సమరసింహారెడ్డి – నరసింహనాయుడు రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి.
ఇక బాలయ్య కెరీర్ 50 ఏళ్లు దాటక నిలబెట్టిన ఘనత బోయపాటి శ్రీనుకే దక్కుతుంది. వీరిద్దరూ కలిసి 2010లో సింహా సినిమాతో హిట్ కొట్టారు. 2014లో లెజెండ్, 2021లో అఖండ సినిమాతో బాలయ్య – బోయపాటిది కూడా హ్యట్రిక్ కాంబినేషన్ అయ్యింది. అలా బాలయ్య తన కెరీర్‌లో ఎంతో మంది దర్శకులతో కలిసి పనిచేసినా పై ముగ్గురు దర్శకుల కాంబినేషన్లు మాత్రం ఆయనకు, ఆయన అభిమానులకు ఎప్పటకీ స్పెషలే.