ప్రతి ఒక్కరి జీవితంలో వివాహమనేది అత్యంత మధురమైన జ్ఞాపకం. అందుకే వధూవరులు పెళ్లి ముహూర్తానికి కొద్ది రోజుల ముందు నుంచే అన్నీ గొప్పగా ఉండేలా సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా వెడ్డింగ్ డ్రెస్, వెడ్డింగ్ వెన్యూ, ఫుడ్ ఇలా చాలా విషయాలలో కేర్ తీసుకుంటారు. మరీ ముఖ్యంగా పెళ్లి రోజున వధూవరులు చాలా ప్రత్యేకంగా, అందంగా కనిపించాలని అనుకుంటారు. ఇందుకు సాధ్యమైనన్ని బ్యూటీ టిప్స్ ఫాలో అవుతారు. అయితే వధూవరులు వీటన్నిటితో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించడం తప్పనిసరి. ప్రధానంగా పెళ్లిరోజుకి ఆరు రోజులు ఉందనగా వధూవరులు కొన్ని పనులు చేయకూడదు. ఆ పనులు ఏవో ఇప్పుడు చూద్దాం.
1. హెయిర్ కలరింగ్
అందరిలోకల్లా తామే అట్రాక్టివ్ గా కనిపించాలని వధువులు అనుకోవడం సహజం. అయితే కొందరు తమ జుట్టు కూడా ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటారు. ఇందుకు తమ జుట్టుకు రంగు వేయడం లేదా డై చేయడం చేస్తారు. సాధారణంగా జుట్టుకి రంగు వేసుకుంటే.. దాన్ని వెంటనే వదిలించుకోవడం అసాధ్యం. ఒకవేళ జుట్టు అనుకున్నట్లుగా కాకుండా చాలా బ్యాడ్ గా తయారైతే.. ఇబ్బందులు తప్పవు. అందుకే వధూవరులు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుందనగా ఈ పనికి దూరంగా ఉండటం మంచిది.
2. ఆల్కహాల్
పెళ్లి కుదిరింది అనగానే అబ్బాయిలు ఫుల్ ఖుషి అవుతుంటారు. తమ స్నేహితులందరికీ శుభవార్తను పంచుకుంటారు. దీంతో వారు బ్యాచిలర్ పార్టీ అడగొచ్చు. అప్పుడు వరుడు పెళ్లికి ముందే పార్టీ జరుపుకొని అందులో మద్యం తాగవచ్చు. అలా కాకపోయినా పెళ్లి అవుతుందన్న సంతోషంలో మద్యం పుచ్చుకునే అవకాశం ఉంది. అయితే పెళ్లికి ముందు ఆల్కహాల్‌కి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే మద్యం తాగడం వల్ల శరీరానికి విపరీతంగా చెమటలు పడతాయి. పెళ్లిరోజు ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే డ్రింకింగ్‌కు దూరంగా ఉండటం బెటర్.
3. కొత్త ఫేస్ క్రీమ్స్ కి దూరం
మరింత అందంగా కనిపించాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ కొత్త కొత్త ఫేస్ స్క్రీమ్స్ వాడటం మంచిది కాదు. ఎందుకంటే అవి పడకపోతే స్కిన్ అలర్జీ రావచ్చు.
4. కొత్త వ్యాయామాలకు దూరం
పెళ్లికి ముందు కొత్త ఎక్సర్‌సైజ్‌ల జోలికి వెళ్లకపోవడమే బెటర్. లేదంటే కండరాల నొప్పి పడితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే వివాహ ఘట్టానికి ముందు వీటికి దూరంగా ఉండాలి.
5. నిద్ర
నిద్ర మానుకుని ఉండటం కూడా మంచిది కాదు. తగిన నిద్ర లేకపోతే బాగా టైర్డ్ అయ్యే అవకాశముంది. దీనివల్ల మూడ్ చెడిపోతుంది. పెళ్లి రోజు ఉత్సాహంగా ఉండలేరు.