అదేమిటో గాని ఒక్క విషయం మాత్రం అంతుబట్టదు. బేసిగ్గా కవులు (రచయితలు) తమ పేరుకి బదులు ఓ మరు పేరుని కలం పేరుగా వాడతారు. అయితే ఇక్కడ మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు తమ అసలు పేర్లకు బదులుగా మారు పేరుని వాడుతుంటారు. కాలాను క్రమంలో అదే పేరు వారికి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఏంటని అడిగితే ఏదో సెంటిమెంటు అని చెబుతూ వుంటారు.
అయితే ఇలా మరు పేర్లతో ఇండస్ట్రీలో చాలామంది హీరోలు చలామణి అవుతున్నారు. అందులో ఎక్కువగా స్టార్ హీరోలు ఉండటం కొసమెరుపు. అందులో మొదటిగా మన మెగాస్టార్ చిరంజీవిని చెప్పుకోవచ్చు. చిరంజీవి అసలు పేరు “కొణిదెల శివశంకర వరప్రసాద్” అని చాలా తక్కువమందికి తెలుసు. అలాగే తమిళ సూపర్ స్టార్ అయినటువంటి రజినీకాంత్ అసలు పేరు మీకు తెలుసా? రజినీకాంత్ అసలు పేరు “శివాజీరావు గైక్వాడ్”.
మన డైలాగ్ కింగ్ మోహన్ బాబు, అసలు పేరు “భక్తవత్సలం నాయుడు”. ఇక ఈ మధ్య కన్నడ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపుతున్న రాక్ స్టార్ యశ్ అసలు పేరు “నవీన్ కుమార్ గౌడ్”. స్టేజ్ షోలతో కెరీర్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు ఈ రాక్ స్టార్. అలాగే మన నేచురల్ స్టార్ నాని… అసలు పేరు “గంటా నవీన్ బాబు”. అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ మొదలు పెట్టి ఇపుడు తెలుగులో ఫైనెస్ట్ స్టార్ గా ఎదిగాడు. ఇక మన బాహుబలి ప్రభాస్ అసలు పేరు “ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు”.
ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇక తమిళ తంబీ ధనుష్ అసలు పేరు “వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా”. మనోడు కూడా సినిమాల్లోకి వచ్చాక సెంటిమెంట్ ప్రకారం పేరు మార్చేసికున్నాడు. అలాగే చివరగా మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు… అసలు పేరు “నరసింహాచారి” అని మీకు తెలుసా? ఇలా ఇంకా అనేకమందికి మారు పేర్లు వున్నాయి. ఇంకా మీకు తెలిసినవారు ఎవరైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి.