Moviesప‌వ‌న్ అత్త ' న‌దియా ' ను అప్ప‌ట్లో డిస్ట‌ర్బ్ చేసిన...

ప‌వ‌న్ అత్త ‘ న‌దియా ‘ ను అప్ప‌ట్లో డిస్ట‌ర్బ్ చేసిన హీరో ఎవ‌రంటే..

సినిమా ఇండ‌స్ట్రీలో హిట్ ఫెయిర్ అన్న‌ది కామ‌నే. హిట్ ఫెయిర్ అంటే ఓ జంట చేసిన సినిమాలు వ‌రుస‌గా హిట్లు అవుతుంటే ఆ జంట‌కు హిట్ ఫెయిర్ ముద్ర ప‌డిపోతుంది. గతంలో ఎన్టీఆర – శ్రీదేవి, కృష్ణ – శ్రీదేవి, ఏఎన్నార్ – జ‌య‌సుధ‌, ఏఎన్నార్ – సావిత్రి, కృష్ణ – జ‌య‌ప్ర‌ద ఇలా ప‌లు కాంబినేష‌న్లు రిపీట్ అయ్యేవి. ఆ త‌ర్వాత కూడా బాల‌య్య – విజ‌య‌శాంతి, చిరు – విజ‌య‌శాంతి, వెంకీ – సౌంద‌ర్య‌, బాల‌య్య – సిమ్రాన్ ఇలా పలు కాంబినేష‌న్లు ప‌దే ప‌దే రిపీట్ అవుతుండ‌డంతో ఆ జంట‌ల‌కు హిట్ ఫెయిర్ అన్న ముద్ర ప‌డిపోయేది. వారిద్ద‌రు కలిసి న‌టిస్తే ఆ సినిమాకు ప్రేక్ష‌కుల్లో కూడా విప‌రీత‌మైన క్రేజ్ ఉండేది.

 

 

అయితే స్టార్ హీరో, హీరోయిన్లు కాంబినేష‌న్లు స‌హ‌జంగానే ప్రేక్ష‌కుల‌కు గుర్తుంటాయి. అయితే మీడియం రేంజ్ హీరోలు, హీరోయిన్ల కాంబినేష‌న్లు కూడా వ‌రుస‌గా రిపీట్ అవుతూ హిట్లు కొట్టిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అదే స‌మ‌యంలో ఎవ‌రైనా హీరో, హీరోయిన్ ప‌దే ప‌దే త‌మ కాంబినేష‌న్‌ను రిపీట్ చేస్తే చాలు వారి మ‌ధ్య సంథింగ్ సంథింగ్ న‌డుస్తుంద‌న్న ప్ర‌చారం కూడా ఎక్కువే న‌డుస్తుంటుంది. అప్ప‌ట్లో సీనియ‌ర్ న‌టుడు సురేష్‌, హీరోయిన్ న‌దియా కాంబినేష‌న్ ప‌దే ప‌దే రిపీట్ అయ్యేద‌ట‌.

 

సురేష్ స్వ‌త‌హాగా సినిమా ఫ్యామిలీ నుంచే వ‌చ్చాడు. సురేష్ తండ్రి చంద్ర‌శేఖ‌ర్ సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో త‌న స్వీయ నిర్మాణంతో పాటు ద‌ర్శ‌క‌త్వంలో రాముని మించిన రాముడు సినిమా చేశారు. సురేష్ తండ్రి ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు కూడా..! తండ్రి వార‌స‌త్వంతో వ‌చ్చిన సురేష్‌కు కెరీర్ స్టార్టింగ్‌లో హీరోగా మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. అయితే మీడియం రేంజ్ హీరోగా ఉండిపోయాడే త‌ప్పా స్టార్ స్టేట‌స్‌కు ఎద‌గ‌లేదు.
కెరీర్ స్టార్టింగ్‌లో సురేష్ – న‌దియా క‌లిసి ఓ త‌మిళ సినిమాలో న‌టించగా ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

ఆ త‌ర్వాత ద‌ర్శ‌క నిర్మాత‌లు వీరి కాంబినేష‌న్‌ను వ‌రుస‌గా రిపీట్ చేయ‌డంతో కొన్ని హిట్ సినిమాలు ప‌డ్డాయి. అలా వ‌రుస సినిమాలు చేస్తోన్న క్ర‌మంలోనే వీరి మ‌ధ్య ప్రేమ పుట్టింద‌ని.. వీరు త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ త‌మిళ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్త‌లు కెరీర్‌లో అప్పుడే ఎదుగుతోన్న సురేష్‌తో పాటు అటు న‌దియాకు కూడా త‌ల‌నొప్పిగా మారాయి. చివ‌ర‌కు సురేష్ ఈ వార్త‌ల‌ను ఖండించుకోవాల్సి వ‌చ్చింది.

ఆ త‌ర్వాత న‌దియాతో క‌లిసి న‌టించే ఛాన్సులు వ‌చ్చినా కూడా రిజెక్ట్ చేశాడు. ఆ సంఘ‌ట‌న త‌ర్వాత ఓ సారి క‌లిసి న‌టించిన హీరోయిన్‌తో మ‌రోసారి క‌లిసి న‌టించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. ఆ త‌ర్వాత న‌దియా ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. సురేష్ హీరోయిన్ అనితారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. త‌ర్వాత వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడాకులు తీసుకుని వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు.

ఇక న‌దియా లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు తెర‌మీద ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల‌తో డిమాండ్ ఉన్న న‌టిగా మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో ఆమె ప‌వ‌న్‌కు అత్త‌గా చేశాక ఆమె తెలుగులో ఇప్పుడు ప‌వ‌న్ అత్త‌గా పాపుల‌ర్ అయిపోయింది. ఇటు సురేష్ కూడా అడ‌పా ద‌డ‌పా వెండితెర మీద క‌నిపిస్తూనే ఉన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news