Moviesఓరి నాయనో..ఆ హీరో కి ఇంత పబ్లిసిటీ పిచ్చా..?

ఓరి నాయనో..ఆ హీరో కి ఇంత పబ్లిసిటీ పిచ్చా..?

ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగిటివిటీ కూడా ఉంటుంది. పైగా ఈ సోషల్ మీడియా యుగంలో జనాల్లో నెగిటివిటీ కూసింత ఎక్కువే ఉన్నట్లు తెలుస్తుంది. ఎవ్వరైనా పడిపోతే ..అయ్యయ్యో , పడిపోయారే అనే హెల్ప్ చేసే చేతులు కన్నా..నా కేందుకు లే వాడు నాకు ఏమైన తెలుసా..ఏంటి..? అని అనుకునే జనాలే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కవేళ పోనీ, ఏదో దయాగల హృదయంతో హెల్ప చేశాడులే అనుకుంటే..వెంటనే..హెల్ప్ చేస్తున్న ఫోటోలు తీసి..సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం..మన డబ్బా మనమే కొట్టుకోవడం వంటివి చేస్తున్నారు.

ఇలా సామాన్యులే కాదు..సెలబ్రిటీలు కూడా చేస్తున్నారు. చిన్న హీరోలు అనుకుని పొరపాటూ పడేరండోయ్..బిగ్ స్టార్..ఇండస్ట్రీలో ఉండే వన్ ఆఫ్ ది స్టార్ హీరో కి కూడా ఈ అలవాటు ఉందట. నిజానికి చాలా మంది హీరోలు తాము చేసిన సాయాని బయటకి చెప్పుకోరు. అది వాళ్ల సింప్లిసిటీ. కానీ, ఇక్కడ ఉన్న ఈ హీరో ..పబ్లిసిటీ పిచ్చోడు అంటుంటారు ఆయన్ని. చిన్న హెల్ప్ చేసినా..సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..పబ్లిసిటీ చేయించుకునే క్యారెక్టర్.

ఈయన డప్పులకి ఫ్యాన్స్ కూడా తాన అంటే తందానా అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏ ఫంక్షన్ కి వెళ్ళిన పేరున్న ఓ సో కాల్డ్ డైరెక్టర్ ని అవసరం ఉన్నా..లేకున్నా..కలగజేసుకుని పొగిడేస్తున్నారు. అంత పబ్లిసిటీ పిచ్చి ఉంది ఈయనకు అంటూ ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ గా మారింది. ఈ విషయం ఆయనతో వర్క్ చేసే నటులకు కూడా తెలుసట..కానీ, బడా హీరో..పైగా డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి.. ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా..ఇండస్ట్రీలో తేడాలు వచ్చేస్తాయి. అందుకే , ఆయన సెల్ఫ్ భజన విని విసుకువస్తున్నా..విసుకోలేక..వినిపించుకోలేక..వింటూనే ఉన్నారు జనాలు ..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news