టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు, అమెరికాలో తెలుగు వాళ్లలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ సినిమాలు జపాన్‌లో పిచ్చగా ఆడేస్తాయి. అక్కడ ఎన్టీఆర్‌కు వీరాభిమానులు చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్ ప్లాప్ సినిమాలకు కూడా జపాన్‌లో మంచి క్రేజ్ ఉంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత జపానల్లో ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న ఇండియన్ నటుడు ఎన్టీఆర్ మాత్రమే.
ఇక జపాన్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ సినిమాల్లో చేసిన విన్యాసాలతో పాటు డ్యాన్సులు కూడా చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. జపాన్ జంటలు ఎన్టీఆర్ పాటలకు చేసిన డ్యాన్సులు కూడా హైలెట్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ తన తాజా సినిమా త్రిబుల్ ఆర్ ( రౌద్రం రణం రుధిరం ) సినిమాతో భారీ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ కొట్టాడు.
ఈ సినిమాతో ఎన్టీఆర్‌కు వరల్డ్ వైడ్‌గా చాలా దేశాల్లో అభిమానులు ఏర్పడ్డారు. ఇంటర్నేషనల్ మీడియాలోనూ ఎన్టీఆర్ ట్రెండ్ అయ్యాడు. తాజాగా ఇజ్రాయిల్లోనూ ఎన్టీఆర్ క్రేజ్ పాకేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆదిలాబాద్ జిల్లాలోని గోండు జాతి వీరుడు కొమరం భీం పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. కొమరం భీంగా ఎన్టీఆర్ వేష, బాషకు ప్రేక్షకులు అలా కనెక్ట్ అయిపోయారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన కొమరం భీం పాత్రపై ఇజ్రాయిల్ దేశంలోని ఓ ప్రముఖ మీడియా లో ఏకంగా ఓ స్పెషల్ ఎడిషన్ ప్రచురించారు. ఈ ఎడిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. అక్కడ పేపర్‌లో ఓ పేజీ అంతా ఎన్టీఆర్ పెర్పామెన్స్ అదిరిపోయిందని చెపుతూ స్పెషల్ ఆర్టికల్ వేశారు. దేశం కాని దేశం.. మన భాషే కాదు.. అలాంటిది ఎన్టీఆర్ అదిరిపోయే నటన గురించి ఓ ఎడిషన్ అంతా వేయడం అంటే ఎన్టీఆర్ పాత్ర వారిని ఎంతలా మెప్పించిందో అర్థమవుతోంది.
ఈ స్పెషల్ ఎడిషన్ క్లిప్పింగ్‌ను ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా త్రిబుల్ ఆర్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా త్రిబుల్ దెబ్బతో ఎన్టీఆర్ కూడా తన నటనతో ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసాడని చెప్పాలి.