బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సోనాలి బింద్రే. తెలుగులో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమాలో ముందు చాలామంది హీరోయిన్స్‌ను అనుకున్న కృష్ణవంశీ తర్వాత హైదరాబాద్ వచ్చిన సోనాలినీ కలిసి కథ చెప్పగానే ఒప్పుకొని హీరోయిన్‌గా నటించడానికి సైన్ చేసింది. అయితే, మురారి సినిమాకు ముందు డివైడ్ టాక్ వచ్చింది. హిందీలో సోనాలి అప్పటికే విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.
ఆగ్, దిల్‌జాలే, మేజర్ సాబ్, సర్ఫరోష్, హమ్ సాత్ సాత్ హై, హమారా దిల్ ఆప్ కె పాస్ హై లాంటి వరుస హిట్స్ అందుకుంది. ఆ తర్వాత కన్నడ సినిమా చేసింది. ఈ క్రమంలోనే తెలుగులో మురారి అవకాశం దక్కింది. ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్‌కు టాలీవుడ్ ప్రేక్షకులు, మేకర్స్ ఫిదా అయ్యారు. అందుకే, ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలోనే ఖడ్గం సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో నాగార్జున సరసన మన్మధుడు సినిమా చేసే అవకాశం దక్కించుకుంది.
ఇలా సోనాలి బింద్రే తెలుగులో నటించిన సినిమాలు కూడా వరుసగా బ్లాక్ బస్టర్ సాధించడంతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎం ఎం బి బి ఎస్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే, ఈ సినిమాలో ముందు అనుకోని సాంగ్‌ను ఆ తర్వాత చేశారు. శంకర్ దాదా రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, ఇంకో సాంగ్ ఉంటే బావుంటుందని అభిమానులు, మేకర్స్ అనుకున్నారు. దాంతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అప్పటికప్పుడు మరో సాంగ్ రెడీ చేశారు.
సోనాలి డేట్స్ తీసుకున్నారు. మెగాస్టార్ డేట్స్ లాక్ చేసి మూడు రోజులు అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో సాంగ్ షూట్ చేశారు. అయితే, ఈ సాంగ్ చేస్తున్న సమయంలో సోనాలి 3 – 4 నెలల గర్భిణి. అయినా కూడా సినిమాలో హీరోయిన్‌గా నటించింది కాబట్టి అడగగానే ఒప్పుకుంది. ఆమెను దృష్ఠిలో పెట్టుకొనే డాన్స్ మాస్టర్ కూడా సింపుల్ స్టెప్స్ కంపోజ్ చేశారు. ఆ సాంగ్ ఏ జిల్లా ఏ జిల్లా ..ఓ పిల్లా నీది ఏ జిల్లా. ఇది మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.