కోలివుడ్ సూపర్ హాట్ లవ్ బార్డ్స్..నయనతార, విగ్నేశ్ శివన్..ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు గా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఫైనల్ గా మూడు మూళ్ల బంధంతో ఒక్కటైయ్యారు. జూన్ 9 న తమిళనాదులోని మహాబలిపురంలో..ఓ రిసార్డ్ లో చాలా సింపుల్ గా సాంప్రదాయబద్ధంగా..ఇద్దరు ఒక్కటయ్యారు. వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారార్యి. ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, ఈ పెళ్లి ఫోటోల్లో నయన్ తల్లి తల్లి ఒమయ కురియన్ మాత్రం కనిపించలేదు. ఆమె ఈ పెళ్ళికి హాజరు కాలేదు అని సమాచారం. దీంతో ఈ మ్యాటర్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా హల్ చల్ చేస్తుంది. సొంత కూతురి పెళ్లికి అమ్మ రాకపోవడం ఏంటి..? పెళ్ళికి ముందే కూతురు..కాబోయే అల్లుడితో ఫోటోలతో బాగానే తిరిగింది కదా..మరి అలాంటి ఆవిడ పెళ్లి రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆ వార్తలకు చెక్ పెట్టడానికి నయన్-విగ్నేశ్ పెళ్లి తరువాత ఆమె ఆశీర్వాదం తీసుకుంటూ..ఫోటోని పోస్ట్ చేసారు.
అయితే, ఆవిడ పెళ్లికి ఎందుకు రాలేదో చెప్పలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం..నయన్ తల్లికి-విగ్నేశ్ తల్లికి ఈ పెళ్ళి విషయంలో కొన్ని పద్ధతుల కారణంగా గొడవ అయ్యిందని.. అందుకే ఆమె పెళ్లికి రాలేదు అని..ఓ రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక పెళ్లి తర్వాత నయనతార విగ్నేష్ తో కలిసి కేరళ లోని అన్ని ఆలయాలను సందర్శిస్తున్నారు. పెళ్లి తరువాత నయన్ ఇక సినిమాలు చేయదు అని అంటున్నారు..కానీ, దీని పై నయన్ ఇప్పటి వరకు అఫిషీయల్ గా స్పందించలేదు.