యస్..ఇప్పుడు నెట్టింట ఇదే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ సమంత..తాను ఎంతో ఇష్టం గా ప్రేమించిన నాగచైతన్యను..పెద్దలను ఒప్పించి..గోవాలో ఘనంగా పెళ్ళి చేసుకుని..ఆ తరువాత కొన్నాళ్లకి వాళ్ల మధ్య ఏవే వో ఇష్యూస్ రావడంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. వీళ్లు విడాకులు ప్రకటించి 7 నెలలు పైనే కావస్తున్నా ..ఇంకా చై-సామ్ విడాకుల మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతుంది.
విడాకులు తీసుకున్న తరువాత సమంతను ..జనాలు ఎంత సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్న కూల్ గానే రియాక్ట్ అవుతూ..తన పని తాను చేసుకుంటూపోతుంది. ఈ క్రమంలోనే అమ్మడు గురించిన వార్త ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీంతో సమంత, నాగచైతన్య కోసం ఇంత పని చేసిందా అంటూ ఆమెను పొగిడేస్తున్నారు సామ్ ఫ్యాన్స్. అంతేనా, నిన్ను సామ్ చాలా ప్రేమిస్తుంది చై..మీరు మళ్ళీ కలవండి అంటూ..కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకి సామ్ చేసిన అంత పెద్ద త్యాగం ఏంటో తెలుసా..చై-సామ్ కలిసి ఉన్నప్పుడు సమంత చాలా పద్ధతిగా ఉండే రోల్స్ నే చేసేది. బిగ్ ఆఫర్స్ వచ్చినా..గ్లామరస్ పాత్రలు కావడంతో రిజెక్ట్ చేసేది. అలా షారుఖాన్ తో సినిమా చేసే అవకాశం వస్తే..ఆమె చై కోసం రిజెక్ట్ చేసిందట. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో జవాన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే .
ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా సెలక్ట్ అయ్యిన్నత్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ రోల్ కి ముందు అనుకున్న హీరోయిన్ సమంతనట..ఆమె చైతన్యతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలనే..ఆ సినిమాను రిజెక్ట్ చేసిందని భోగట్టా. కానీ,పాప,..ఆ తరువాత కొద్ది నెలలకే వాళ్లు విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారు. ఇప్పటికి అర్ధం కానీ విషయం ఏమిటంటే..ఇంత ప్రేమించుకున్న వీళ్లు ఎందుకు విడిపోయారు..?